Breaking News

గంభీర్‌, సెహ్వాగ్‌, భజ్జీ.. అంతా బాధితులే.. చెత్తలా చూస్తారు: ధోనిపై ఫైర్‌

Published on Thu, 09/04/2025 - 19:20

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni)పై భారత మాజీ క్రికెటర్‌ యోగ్‌రాజ్‌ సింగ్‌ (Yograj Singh) మరోసారి తీవ్ర విమర్శలు చేశాడు. తనకు నచ్చిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని.. నచ్చనివాళ్ల కెరీర్‌ను నాశనం చేశాడని ఆరోపించాడు. కాగా తన కుమారుడు, టీమిండియా లెజెండ్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) కెరీర్‌ ముగిసిపోవడానికి ధోనినే కారణమని యోగ్‌రాజ్‌ గతంలో ఎన్నోసార్లు విమర్శించిన విషయం తెలిసిందే.

గంభీర్‌, సెహ్వాగ్‌, భజ్జీ.. అంతా బాధితులే
తాజాగా మరో మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌.. ధోని గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో.. యోగ్‌రాజ్‌ మరోసారి తెరమీదకు వచ్చాడు. ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇది కేవలం ఇర్ఫాన్‌ ఒక్కడి గురించే కాదు. గౌతం గంభీర్‌ కూడా చాలాసార్లు తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాడు.

వీరేందర్‌ సెహ్వాగ్‌ కూడా బహిరంగంగానే ఈ విషయం గురించి చెప్పాడు. హర్భజన్‌ సింగ్‌ కూడా తనను ఈగలాగా పక్కనపెట్టాడని చెప్పాడు. అసలు ధోని ఎందుకు అలా చేశాడో తెలుసుకోవడానికి జ్యూరీని ఏర్పాటు చేయాలి.

కానీ.. ఎంఎస్‌ ధోని వారికి జవాబు ఇవ్వడు. తప్పు చేసిన వాళ్లే ఇలా తప్పించుకుతిరుగుతారు. అయినా వారి ఆత్మసాక్షికి అంతా తెలిసే ఉంటుంది’’ అని యోగ్‌రాజ్‌ సింగ్‌ ధోనిపై మరోసారి ఆరోపణలు చేశాడు.

చెత్తలా తీసిపడేస్తారు
అదే విధంగా.. మాజీ కెప్టెన్ల గురించి మాట్లాడుతూ.. ‘‘బిషన్‌ సింగ్‌ బేడి, కపిల్‌ దేవ్‌, ఎంఎస్‌ ధోని.. వీళ్లంతా మనుషులను ఓ చెత్తలా తీసిపడేస్తారు. మరోసారి చెప్తున్నా.. మనకు ఉన్న ఇలాంటి కెప్టెన్ల వల్లే మన జట్టు నాశనమైంది’’ అని యోగ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్‌
కాగా భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్‌గా ధోనికి పేరుంది. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2013 టైటిళ్లను కెప్టెన్‌ హోదాలో ధోని గెలిచాడు. ఇదిలా ఉంటే.. గతంలో ధోనిని ఉద్దేశించి ఇర్ఫాన్‌ పఠాన్‌ చేసిన వ్యాఖ్యలు తాజాగా మరోసారి వైరల్‌ అవుతున్నాయి.

ధోని, నేను కలిసి కూర్చుని తాగుతున్నాం
నచ్చిన వాళ్లు, హుక్కా తాగుతూ.. అతడికి అందించే వాళ్లకే జట్టులో చోటు ఉంటుందని ఇర్ఫాన్‌ పఠాన్‌ గతంలో పరోక్షంగా ధోనిని విమర్శించాడు.  ఇటీవల టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ పుట్టినరోజు నేపథ్యంలో ఇర్ఫాన్‌ విషెస్‌ చెప్పగా.. ఓ నెటిజన్‌.. ‘‘హుక్కా సంగతి ఏమైంది భయ్యా’’ అని అడిగారు. 

ఇందుకు ఇర్ఫాన్‌ బదులిస్తూ.. ధోని, నేను కలిసి కూర్చుని తాగుతున్నాం అంటూ కామెంట్‌ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో యోగ్‌రాజ్‌ సింగ్‌ మరోసారి ధోనిని టార్గెట్‌ చేశాడు.

ఐదు వికెట్లు.. పదకొండు పరుగులు
కాగా 67 ఏళ్ల యోగ్‌రాజ్‌ సింగ్‌ 1980- 81 మధ్య టీమిండియా తరఫున ఆడాడు. ఆరు వన్డేల్లో కలిపి నాలుగు వికెట్లు తీయడంతో పాటు ఒక పరుగు సాధించిన ఈ సీమర్‌.. ఒక టెస్టు ఆడి ఒక వికెట్‌ తీయడంతో పాటు.. పది పరుగులు చేశాడు. అయితే, తన కుమారుడు యువరాజ్‌ సింగ్‌ను మాత్రం యోగ్‌రాజ్‌ మేటి క్రికెటర్‌గా తీర్చిదిద్దడంలో సఫలమయ్యాడు. 

చదవండి: సెన్స్‌ ఉందా?.. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌ ఏంటి?: రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)