Breaking News

అతడిని అందుకే పక్కనపెట్టాం!.. గంభీర్‌ తొలి స్పందన

Published on Mon, 11/10/2025 - 21:13

ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో గెలిచి బదులు తీర్చుకుంది. కంగారూ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో గెలిచి సత్తా చాటింది. ఇక వర్షం కారణంగా తొలి, ఐదో టీ20 రద్దైన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు టీమిండియా స్టార్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh)ను పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది. పొట్టి ఫార్మాట్లో భారత్‌ తరఫున వందకు పైగా వికెట్లు తీసి హయ్యస్ట్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్న అర్ష్‌ను కాదని.. హర్షిత్‌ రాణా (Harshit Rana)ను ఆడించడం విమర్శలకు దారితీసింది.

అందుకే ఆడించారా?
హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)కు ప్రియ శిష్యుడైన కారణంగానే హర్షిత్‌కు తుదిజట్టులో చోటిచ్చి.. అర్ష్‌ను బలి చేస్తున్నారనే ట్రోల్స్‌ వచ్చాయి. అయితే, ఎట్టకేలకు మూడో టీ20 నుంచి హర్షిత్‌ను తప్పించి.. అర్ష్‌దీప్‌ను ఆడించగా.. అతడు సత్తా చాటాడు.

మూడో టీ20లో హర్షిత్‌ను బెంచ్‌కు పరిమితం చేసి అర్ష్‌దీప్‌ను తీసుకురాగా.. అతడు మూడు వికెట్లు తీసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగో టీ20లోనూ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌ తాజాగా ఈ విషయాలపై స్పందించాడు.

అన్నింటికంటే కష్టమైన పని
బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. కీలక ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేయాల్సి వచ్చినపుడు మీరెలా హ్యాండిల్‌ చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కోచ్‌గా నాకిదే అన్నింటికంటే కష్టమైన పని.

నాణ్యమైన ఆటగాళ్లను బెంచ్‌ మీద కూర్చోబెట్టాల్సి వచ్చినపుడు వారితో ఆ విషయం చెప్పడం కఠినంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు తుదిజట్టులో ఆడేందుకు అర్హులే. కానీ కూర్పు దృష్ట్యా మేము మాకు కావాల్సిన పదకొండు మందినే ఎంచుకుంటాం.

మ్యాచ్‌ పరిస్థితికి తగ్గట్లుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. అయితే, ఓ ఆటగాడితో .. ‘నీకు ఈ మ్యాచ్‌లో అవకాశం లేదు’ అని చెప్పడం కష్టం. అయితే, కూడా అందుకు గల కారణాన్ని స్పష్టంగా వివరించడం వల్ల పెద్దగా సమస్యలు రావు.

అతడిని అందుకే పక్కనపెట్టాం
ఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కోచ్‌, ప్లేయర్‌.. ఇద్దరి మధ్య ఇలాంటి సంభాషణ ఇద్దరికీ కష్టంగానే ఉంటుంది. కానీ ఒక్కోసారి కఠినంగా ఉండక తప్పదు. అయితే, కోచ్‌ చెప్పే విషయంలో నిజం, నిజాయితీ, ముక్కుసూటితనం ఉందని ఆటగాడు తెలుసుకుంటే.. ఇక అతడికి ఎలాంటి అభ్యంతరం ఉండదు.

చాలా మంది ప్లేయర్లు ఇలాంటి సమయంలో పరిణతితో వ్యవహరిస్తారు. ఏదేమైనా కమ్యూనికేషన్‌ అత్యంత ముఖ్యం. బయట చాలా మంది ఇష్టారీతిన మాట్లాడుతూ.. వివాదాలు సృష్టించేందుకు థియరీలు కనిపెడుతుంటారు.

అయితే, జట్టులో సమన్వయం ఉన్నపుడు ఇలాంటి వాటి వల్ల పెద్దగా ప్రభావం పడదు. డ్రెసింగ్‌రూమ్‌లో పారదర్శకత, నిజాయితీ అవసరం. ప్రస్తుతం మేము అదే చేస్తున్నాం’’ అని గంభీర్‌ విమర్శలను కొట్టిపారేశాడు.

చదవండి: కోచ్‌గా అలాంటి పని ఎప్పటికీ చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)