Breaking News

'అతడొక అద్భుతం.. కానీ ఆసీస్‌ బౌలర్ల నుంచి కఠిన పరీక్ష తప్పదు'

Published on Thu, 08/22/2024 - 18:40

టీమిండియా యవ సంచ‌ల‌నం య‌శ‌స్వీ జైశ్వాల్‌పై ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హేడెన్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. జైశ్వాల్ అద్భుతమైన ఆటగాడని హేడన్ కొనియాడాడు. అయితే  రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బౌలర్ల నుంచి యశస్వీ  కఠినమైన పరీక్షను ఎదుర్కొంటాడని అతడు అభిప్రాయపడ్డాడు. 

జైశ్వాల్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌. భారత్‌కు క్రికెట్‌కు దొరికిన విలువైన ఆస్తి. అతడి స్ట్రోక్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా యశస్వీ కవర్స్‌పై నుంచి ఆడే షాట్స్ గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. అతడు తన బ్యాటింగ్ స్కిల్స్‌తో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే బౌన్సీ పిచ్‌లపై ఎలా ఆడుతాన్నది చూడాలి. 

జైశ్వాల్ బంతిని హార్డ్‌గా హిట్ చేయడం మనం చాలా సార్లు చూశాం. కానీ ఆస్ట్రేలియా పిచ్‌లలో హార్డ్ హిట్టింగ్ చేయడం అంత ఈజీకాదు. వరల్డ్‌క్లాస్ బౌలర్ల నుంచి జైశ్వాల్‌కు బిగ్ ఛాలెంజ్ ఎదురుకానుంది. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లను ఎదుర్కొనేందుకు యశస్వీ సిద్దంగా ఉండాలి. 

అదే విధంగా మైదానాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. అక్కడ సిక్స్‌లు కొట్టడం అంత సులభం కాదు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోతే ఫీల్డర్‌కు ఈజీగా దొరికిపోతారు. కాబట్టి ఆసీస్ కండీషన్స్‌లో జైశ్వాల్ కాస్త ఆచితూచి ఆడాలని సీఈఏట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌లో హేడన్ పేర్కొన్నాడు.

 కాగా జైశ్వాల్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉంది. కేవలం తొమ్మిది టెస్టులు మాత్రమే ఆడిన జైశ్వాల్ 70.07 స్ట్రైక్ రేటుతో 1028 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది నవంబర్‌లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు భారత జట్టు వెళ్లనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)