Breaking News

నాకొద్దు... లావైపోతా!

Published on Mon, 12/08/2025 - 03:03

సాక్షి, విశాఖపట్నం: టెస్టుల్లో పోగుట్టుకున్న సిరీస్‌ తాలూకు ప్రతిష్టను భారత్‌ వెంటనే విశాఖ తీరంలో వన్డే సిరీస్‌తో నిలబెట్టుకుంది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో విన్నర్స్‌ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చిన ఆటగాళ్లంతా హోటల్‌కు చేరాక కూడా సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా సెంచరీ హీరో యశస్వి జైస్వాల్‌ కేక్‌ కోసి ‘కింగ్‌’ కోహ్లి నోటిని తీపి చేశాడు. తర్వాత అక్కడే ఉన్న ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మకూ  కేక్‌ ముక్కను తినిపించబోయాడు. 

వెంటనే ఏమాత్రం మొహమాటం లేకుండా రోహిత్‌ ‘ప్లీజ్‌... నాకొద్దు. దీన్ని తింటే తిరిగి లావెక్కిపోతా’నంటూ జైస్వాల్‌ ప్రయత్నాన్ని వారించాడు. దీంతో అక్కడున్న సహచరులంతా పెద్దగా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. లెక్కలేనన్ని లైక్స్, రీట్వీట్స్‌తో సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తుంది. కేక్‌ చిన్న ముక్కే అయినా రోహిత్‌ కఠినమైన డైట్‌కు ఇబ్బంది కలగొచ్చనే బెంగతోనే ‘హిట్‌మ్యాన్‌’ సున్నితంగా తిరస్కరించాడు. 

కోహ్లిలాగే కేవలం వన్డేలకే పరిమితమైన ఈ స్టార్‌ ఓపెనర్, మాజీ విజయవంతమైన కెప్టెన్  గత కొంతకాలంగా ఫిట్‌నెస్‌పైనే ప్రధానంగా దృష్టిపెట్టాడు. వన్డే వరల్డ్‌కప్‌ (2027)కు దాదాపు ఏడాదిన్నర ఉండటంతో నోటిని డైట్‌ క్రమశిక్షణతో కట్టిపడేశాడు. దీనివల్లే అతను ఏకంగా 11 కిలోల బరువుతగ్గాడు. 

ఇంట్లో నోటిని అదుపులో పెట్టుకున్న ఈ దిగ్గజ బ్యాటర్‌ క్రీజులో మాత్రం బ్యాట్‌కు పనిచెబుతున్నాడు. ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా భారీషాట్లతో చెలరేగిపోతున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ రోహిత్‌ రెండు అర్ధసెంచరీలను సాధించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ గెలిచింది. సిరీస్‌ కైవసం చేసుకుంది.  

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు