Breaking News

యశస్వి జైస్వాల్‌ సంచలన నిర్ణయం!

Published on Wed, 04/02/2025 - 15:32

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో ఇకపై ముంబైకి ఆడకూడదని ఈ యువ ఓపెనర్‌ నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA)కు జైసూ ఈ- మెయిల్‌ పంపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కాగా ఉత్తరప్రదేశ్‌లోని సురియాకు చెందిన యశస్వి జైస్వాల్‌.. దేశవాళీ క్రికెట్‌లో చాలా ఏళ్లుగా ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన అండర్‌-19 కెరీర్‌ నుంచి ముంబైకి ఆడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. విజయ్‌ హజారే (వన్డే) టోర్నీలో డబుల్‌ సెంచరీ బాదడం ద్వారా క్రికెట్‌ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.

డబుల్‌ సెంచరీలతో సత్తా చాటి
అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో ఆడే అవకాశం దక్కించుకున్న జైస్వాల్‌ 2020లో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. కెరీర్‌ ఆరంభం నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న 23 ఏళ్ల జైస్వాల్‌.. అక్కడసత్తా చాటడం ద్వారా 2023లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

టెస్టుల్లో సత్తా చాటుతున్న ఈ యువ ఓపెనర్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా జట్టులో పాతుకుపోయాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున 19 టెస్టుల్లో 1798 పరుగులు చేసిన జైసూ ఖాతాలో నాలుగు శతకాలతో పాటు.. రెండు డబుల్‌ సెంచరీలు ఉండటం విశేషం. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం సత్తా చాటలేకపోతున్నాడు. 23 టీ20లలో కలిపి 723 పరుగులు చేసిన జైస్వాల్‌.. ఒకే ఒక్క వన్డే ఆడి 15 పరుగులకే పరిమితమయ్యాడు.

ఇక జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు దేశవాళీ క్రికెట్‌ ఆడాలన్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు.. 2024 రంజీ బరిలో దిగాడు జైస్వాల్‌. ముంబై తరఫున రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేసి విఫలమయ్యాడు. 

గోవాకు ఆడేందుకు సిద్ధం
అయితే, వచ్చే సీజన్‌ నుంచి జైస్వాల్‌ గోవాకు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయాన్ని ఎంసీకేకు మెయిల్‌ ద్వారా తెలిపినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది.

అర్జున్‌ టెండుల్కర్‌, సిద్దేశ్‌ లాడ్‌ మాదిరి జైస్వాల్‌ కూడా ముంబై జట్టును వీడి.. గోవాకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ విషయం గురించి ఎంసీఏ వర్గాలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడు గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయమై నిరభ్యంతర పత్రం (No Objection Certificate) కోసం మెయిల్‌ పంపాడు.

వ్యక్తిగత కారణాల వల్లే గోవాకు ప్రాతినిథ్యం వహించాలని భావిస్తున్నట్లు తెలిపాడు’’ అని తెలిపాయి. కాగా గోవా జట్టుకు జైస్వాల్‌ కెప్టెన్‌గా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక జైసూ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. 

ఫామ్‌లేమితో సతమతం
గతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో చతికిల పడ్డ యశస్వి జైస్వాల్‌.. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసి.. ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో పదిహేను పరుగులు మాత్రమే చేశాడు. 

ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-202 ప్రాథమిక జట్టులో అతడికి చోటు ఇచ్చిన సెలక్టర్లు.. ఆ తర్వాత ప్రధాన జట్టు నుంచి తప్పించారు. ఇక ఐపీఎల్‌-2025లోనూ ఈ రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి జైస్వాల్‌ కేవలం 34 పరుగులే చేశాడు. కాగా రూ. 18 కోట్లకు రాజస్తాన్‌ అతడిని రిటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు ఆ క్రెడిట్‌ దక్కలేదు: టీమిండియా దిగ్గజం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)