Breaking News

భారీ జంప్‌ కొట్టిన శుభ్‌మన్‌.. ఆరో స్థానానికి ఎగబాకిన యశస్వి

Published on Wed, 07/17/2024 - 14:41

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ భారీ జంప్‌ కొట్టాడు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో గిల్‌ ఏకంగా 36 స్థానాలు మెరుగుపర్చుకుని 37వ స్థానానికి ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్‌లో గిల్‌తో పాటు మరో టీమిండియా బ్యాటర్‌ భారీ లబ్ది పొందాడు. ఇదివరకే టాప్‌-10లో ఉండిన యశస్వి జైస్వాల్‌.. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకాడు. 

గత నెలలో రెండో స్థానానికి పడిపోయిన సూర్యకుమార్‌.. ఇటీవల జింబాబ్వేతో సిరీస్‌ ఆడనప్పటికీ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌ ఆటగాడు ఫిలిప్‌ సాల్ట్‌ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరాడు. ట్రవిస్‌ హెడ్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. పాక్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ ఏడు, టీమిండియా ప్లేయర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఎనిమిది, విండీస్‌ ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌, జాన్సన్‌ ఛార్లెస్‌ తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్‌-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. ఆదిల్‌ రషీద్‌, నోర్జే, హసరంగ, రషీద్‌ ఖాన్‌, హాజిల్‌వుడ్‌, అకీల్‌ హొస్సేన్‌, ఆడమ్‌ జంపా, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, మహీశ్‌ తీక్షణ ఒకటి నుంచి తొమ్మిది స్థానాలను నిలుపుకున్నారు. అల్జరీ జోసఫ్‌, తబ్రేజ్‌ షంషి, గుడకేశ్‌ మోటీ తలో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 10, 11, 12 స్థానాలకు ఎగబాకారు. 

భారత బౌలర్లలో టాప్‌-10లో ఎవరూ లేకపోగా.. అక్షర్‌ పటేల్‌ నాలుగు స్థానాలు దిగజారి 13కు.. రవి బిష్ణోయ్‌ నాలుగు స్థానాలు దిగజారి 19కి, జస్ప్రీత్‌ బుమ్రా ఏడు స్థానాలు దిగజారి 21వ స్థానానికి పడిపోయారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్‌ పాండ్యా నాలుగు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి పడిపోగా.. హసరంగ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)