Breaking News

చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్‌.. ఒకే ఒక్కడిగా రికార్డు

Published on Fri, 06/20/2025 - 21:57

టెస్టు క్రికెట్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన అద్బుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జైశ్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.

144 బంతుల్లోనే జైశ్వాల్ తన ఐదో టెస్టు సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 16 ఫోర్లు, 1 సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించాడు.

ఆ తర్వాత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 131 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 69 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఈ క్రమంలో జైశ్వాల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 

జైశ్వాల్‌ సాధించిన రికార్డులు ఇవే..
👉ఇంగ్లండ్‌లోని లీడ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ టీమిండియా ఓపెనర్ ఈ ఫీట్ సాధించలేకపోయాడు. 1967లో భారత క్రికెట్ దిగ్గజం ఫరూక్ ఇంజనీర్ చేసిన 87 పరుగులే.. టీమిండియా ఓపెనర్ లీడ్స్‌లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇప్పుడు 58 ఏళ్ల ఫరూక్ ఇంజనీర్ రికార్డును జైశూ బ్రేక్ చేశాడు

👉ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా రెండు దేశాల్లోనూ తన కెరీర్‌లో ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఏకైక  భారత ఆటగాడిగా జైశ్వాల్‌నిలిచాడు. గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో జైశ్వాల్ సెంచరీతో మెరిశాడు. ఆసీస్ గడ్డపై జైశ్వాల్‌కే అదే తొలిటెస్టు మ్యాచ్‌.

👉ఇంగ్లండ్‌పై గడ్డపై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన ఐదో భార‌త ఆట‌గాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో అగ్ర‌స్ధానంలో భార‌త మాజీ ప్లేయ‌ర్‌ విజయ్ మంజ్రేకర్ ఉన్నారు. విజయ్ మంజ్రేకర్ 1952లో ఇంగ్లండ్‌లో ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేశాడు.

ఇంగ్లండ్‌లో త‌మ తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచ‌రీలు చేసిన భార‌త ఆట‌గాళ్లు వీరే
133 విజయ్ మంజ్రేకర్- హెడింగ్లీ 1952
131 సౌరవ్ గంగూలీ -లార్డ్స్ 1996
129*సందీప్ పాటిల్ -ఓల్డ్ ట్రాఫోర్డ్ 1982
146 ముర‌ళీ విజయ్ -ట్రెంట్ బ్రిడ్జ్ 2014
100*యశస్వి జైస్వాల్ హెడింగ్లీ 2025
చదవండి: ENG vs IND: ఇషాన్ కిషన్‌కు ఆ జట్టు నుంచి పిలుపు.. అక్కడ బాగా రాణిస్తే?
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)