Breaking News

మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్‌

Published on Tue, 01/07/2025 - 08:50

ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా తీవ్ర నిరాశ‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో భార‌త్ కోల్పోయింది. దీంతో ప‌దేళ్ల త‌ర్వాత బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ భార‌త్ చేజారిపోయింది.

అయితే ఈ సిరీస్‌లో టీమిండియా ఓట‌మి పాలైన‌ప్ప‌టికి యువ ఆట‌గాడు యశస్వి జైస్వాల్ త‌న ప్ర‌ద‌ర్శ‌నతో ఆక‌ట్టుకున్నాడు. తొలిసారి ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఆడిన య‌శ‌స్వి.. మిచెల్ స్టార్క్‌, క‌మ్మిన్స్‌, హాజిల్‌వుడ్ వంటి వ‌ర‌ల్డ్‌క్లాస్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్ద‌వంతంగా ఎదుర్కొని ప‌రుగులు సాధించాడు.

మొత్తం ఐదు మ్యాచ్‌ల‌లో ఓ సెంచ‌రీ,   2 అర్ధసెంచరీలు సహా అతను 43.44 సగటుతో 391 పరుగులు చేశాడు. ట్రవిస్‌ హెడ్‌ (448) తర్వాత ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైశ్వాల్ రెండో స్ధానంలో నిలిచాడు. తాజాగా తన తొలి ఆస్ట్రేలియా పర్యటనపై జైశ్వాల్‌ సోషల్‌​ మీడియా వేదికగా స్పందించాడు.

‘ఆ్రస్టేలియా గడ్డపై ఎంతో నేర్చుకున్నాను. దురదృష్టవశాత్తూ మేం ఆశించిన ఫలితం రాలేదు. అయితే మున్ముందు మరింత బలంగా పైకి లేస్తాం. మీ అందరి మద్దతు ఎంతో ప్రోత్సాహించింది’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో యశస్వి ఈ పోస్ట్‌ చేశాడు. కాగా జైశ్వాల్ పోస్ట్‌పై ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ ఉస్మాన్ ఖావాజా స్పందించాడు. నీ ప‌నిని ప్రేమించు బ్ర‌ద‌ర్ అంటూ ఖావాజా కామెంట్ చేశాడు.
చదవండి: PAK vs SA: రెండో టెస్టులో పాకిస్తాన్‌ చిత్తు.. దక్షిణాఫ్రికాదే సిరీస్‌

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)