Breaking News

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. చ‌రిత్ర‌కు అడుగు దూరంలో జైశ్వాల్‌

Published on Sat, 06/28/2025 - 13:48

భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి పుంజుకోవాల‌ని భార‌త్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం త‌మ జోరును ఎడ్జ్‌బాస్ట‌న్‌లో కూడా కొన‌సాగించాల‌ని ఉవ్విళ్లూరుతోంది.

అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్‌కు అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టెస్టులో జైశ్వాల్ 97 ప‌రుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 2,000 పరుగుల మైలు రాయిని అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా రికార్డులెక్కుతాడు. జైశ్వాల్ ఇప్ప‌టివ‌ర‌కు 20 టెస్టుల్లో 52.86 సగటుతో 1,903 పరుగులు చేశాడు.

ప్ర‌స్తుతం ఈ రికార్డు భార‌త లెజండ‌రీ క్రికెట‌ర్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. సునీల్ గ‌వాస్క‌ర్ ఈ ఫీట్‌ను తన 23వ టెస్ట్‌లో నమోదు చేశారు. 1976 ఏప్రిల్ 7 నుండి 12 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన టెస్టులో ఈ ఘ‌న‌త సాధించారు. గ‌వాస్క‌ర్ త‌ర్వాతి స్ధానంలో ప్రస్తుత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారు. గంభీర్ ఈ ఫీట్‌ను త‌న 24వ టెస్టు మ్యాచ్‌లో అందుకున్నాడు

టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన భార‌త ఆట‌గాళ్లు
👉సునీల్ గవాస్కర్ - 23 మ్యాచ్‌లు
👉గౌతమ్ గంభీర్ - 24
👉రాహుల్ ద్రవిడ్ - 25
👉వీరేంద్ర సెహ్వాగ్ - 25
👉విజయ్ హజారే - 26
👉చెతేశ్వర్ పుజారా – 26
👉సౌరవ్ గంగూలీ - 27
👉శిఖర్ ధావన్ - 28
👉పటౌడీ - 28
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)