Breaking News

విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన భారత యువ కెరటం

Published on Sun, 08/03/2025 - 19:04

ఇటీవలికాలంలో భారత అండర్‌-19 క్రికెట్‌ హీరోలు చెలరేగిపోతున్నారు. వైభవ్‌ సూర్యవంశీ, ఆయుశ్‌ మాత్రే లాంటి వారు ఇటీవల ఇంగ్లండ్‌ గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగగా.. తాజాగా ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌-2025లో భారత అండర్‌-19 జట్టు మాజీ సారధి యశ్‌ ధుల్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 

డీపీఎల్‌ 2025 రెండో మ్యాచ్‌లో ధుల్‌ సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌కు ఆడుతూ నార్త్రన్‌ ఢిల్లీ స్ట్రయికర్స్‌పై 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు చేశాడు. ఫలితంగా సెంట్రల్‌ ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ప్రస్తుత డీపీఎల్‌ సీజన్‌లో ధుల్‌ సెంచరీనే మొదటిది. గత సీజన్‌ మొత్తంలో 93 పరుగులే చేసిన ధుల్‌ ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. రెడ్‌ బాల్‌ బ్యాటర్‌గా ముద్రపడిన ధుల్‌ ఈ ఇన్నింగ్స్‌తో ఆ ముద్రను చెరిపేసి ఆల్‌ ఫార్మాట్‌ బ్యాటర్‌ అనిపించుకున్నాడు. 

అండర్‌-19 క్రికెట్‌ ప్రదర్శనల ఆధారంగా 2023 ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున అరంగేట్రం చేసిన ధుల్‌.. ఆ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 16 పరుగులే చేశాడు. ఆ సీజన్‌లో పేలవ ప్రదర్శన తర్వాత ధుల్‌ను ఏ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. తాజాగా ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ధుల్‌ను మరోసారి దక్కించుకనే ప్రయత్నం చేయవచ్చు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉత్తర ఢిల్లీ.. సర్తక్‌ రంజన్‌ (82), అర్నవ్‌ బుగ్గా (67) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సెంట్రల్‌ ఢిల్లీ బౌలర్లలో గవిన్ష్‌ ఖురానా, మనీ గ్రేవాల్‌ తలో 2 వికెట్లు తీయగా.. సిమర్‌జీత్‌ సింగ్‌, తేజస్‌ బరోకా తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సెంట్రల్‌ ఢిల్లీ.. ఓపెనర్‌ యశ్‌ ధుల్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 17.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (2 వికెట్లు కోల్పోయి). సెంట్రల్‌ ఢిల్లీని విజయతీరాలకు చేర్చడంలో ధుల్‌కు యుగల్‌ సైనీ (36), జాంటి సిద్దూ (23 నాటౌట్‌) సహకరించారు. ఉత్తర ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 2 వికెట్లు తీశాడు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)