Breaking News

ఆసీస్‌ను వెనక్కు నెట్టి టాప్‌ ప్లేస్‌కు చేరిన సౌతాఫ్రికా

Published on Mon, 12/09/2024 - 17:04

శ్రీలంకపై రెండో టెస్ట్‌లో విజయం అనంతరం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌లో ఉండింది. తాజా విజయంతో సౌతాఫ్రికా ఆసీస్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరేందుకు సౌతాఫ్రికా మరో గెలుపు దూరంలో ఉంది. సౌతాఫ్రికా తమ తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే పాకిస్తాన్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌ గెలిచినా చాలు.

ప్రస్తుతం సౌతాఫ్రికా విజయాల శాతం 63.33గా ఉంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో సౌతాఫ్రికా ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 60.71 విజయాల శాతం కలిగి ఉంది. ఆసీస్‌ చేతిలో రెండో టెస్ట్‌లో ఓటమి అనంతరం టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్‌ విజయాల శాతం 57.29గా ఉంది. ప్రస్తుత సైకిల్‌లో టీమిండియా 16 మ్యాచ్‌లు ఆడి తొమ్మిదింట విజయాలు సాధించింది. 

సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయిన శ్రీలంక నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల శాతం 45.45గా ఉంది. న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై వరుసగా రెండు టెస్ట్‌ల్లో మట్టికరిపించిన ఇంగ్లండ్‌ ఐదో స్థానంలో ఉంది. స్వదేశంలో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న న్యూజిలాండ్‌ ఆరో స్థానంలో.. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ వరుసగా 7, 8, 9 స్థానాల్లో ఉన్నాయి.

టీమిండియా విషయానికొస్తే.. భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌తో తదుపరి జరుగబోయే మూడు టెస్ట్‌ల్లో విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై 4-1 తేడాతో ఓడిస్తే భారత విజయాల శాతం 63.15కు చేరి టేబుల్‌ టాపర్‌గా నిలుస్తుంది. ఇలా జరిగితే భారత్‌ ఇతర జట్ల జయాపజాలపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఆసీస్‌తో తదుపరి జరుగబోయే మూడు టెస్ట్‌ల్లో భారత్‌ ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)