Breaking News

చివరి స్థానానికి పడిపోయిన పాకిస్తాన్‌

Published on Fri, 10/11/2024 - 15:45

ముల్తాన్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర ఓటమి అనంతరం పాకిస్తాన్‌ జట్టు వరల్డ్‌ టెస్ట్‌ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో (2023-25) పాక్‌ ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం 16.67 విజయాల శాతం కలిగి ఉంది. 

మరోవైపు పాక్‌పై ఘన విజయం సాధించిన ఇంగ్లండ్‌ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇంగ్లండ్‌ ఇప్పటివరకు ఆడిన 17 మ్యాచ్‌ల్లో 45.59 విజయాల శాతం కలిగి ఉంది.

పాయింట్ల పట్టికలో భారత్‌ (11 మ్యాచ్‌ల్లో 74.24 విజయాల శాతం) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా (12 మ్యాచ్‌ల్లో 62.50 విజయాలు శాతం) రెండు.. శ్రీలంక (9 మ్యాచ్‌ల్లో 55.56 విజయాల శాతం) మూడు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ వరుసగా ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. డబ్ల్యూటీసీ సైకిల్‌ ముగిసిన అనంతరం టాప్‌-2లో ఉండే జట్లు ఛాంపియన్‌షిప్‌ కోసం పోటీపడతాయి.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో ఇవాళ ముగిసిన ముల్తాన్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ అబ్దుల్లా షఫీక్‌ (102), షాన్‌ మసూద్‌ (151), అఘా సల్మాన్‌ (104 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌.. జో రూట్‌ డబుల్‌ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్‌ సెంచరీతో‌ (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్‌ (823/7 డిక్లేర్‌) చేసింది.

267 పరుగులు వెనుకపడి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్‌) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్‌ (63), ఆమెర్‌ జమాల్‌ (55 నాటౌట్‌) పాక్‌ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ 4, అట్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్‌ తలో 2, క్రిస్‌ వోక్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

పాక్‌ చెత్త రికార్డులు..
2022 నుంచి పాక్‌ స్వదేశంలో ఒక్క టెస్ట్‌ మ్యాచ్‌లో కూడా గెలువలేదు.

గత రెండేళ్లలో 11 మ్యాచ్‌లు ఆడిన పాక్‌ ఏడింట ఓడిపోయి, నాలుగు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

తొలి ఇన్నింగ్స్‌లో 500 ప్లస్‌ స్కోర్‌ చేసి ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిన తొలి జట్టుగా పాక్‌ చెత్త రికార్డు మూటగట్టుకుంది.

పాక్‌ స్వదేశంలో టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచి 1331 రోజులవుతుంది.

పాక్‌ కెప్టెన్‌గా తొలి ఆరు మ్యాచ్‌లు ఓడిన షాన్‌ మసూద్‌. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదో చెత్త రికార్డు.

చదవండి: పాకిస్తాన్ చెత్త రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చ‌రిత్రలో తొలిసారి
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)