Breaking News

WTC Final IND VS AUS: ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని గెలిచారు..?

Published on Sun, 06/04/2023 - 21:05

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ మ్యాచ్‌ నేపథ్యంలో చాలా ఆసక్తికర గణాంకాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అలాంటి సమాచారమే మరొకటి, నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఐసీసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్ని ఫైనల్‌ మ్యాచ్‌లు (వన్డే వరల్డ్‌కప్‌ (12), టీ20 వరల్డ్‌కప్‌ (8), డబ్ల్యూటీసీ (1), ఛాంపియన్స్‌ ట్రోఫీ (8)) జరిగాయి.. అందులో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ఎన్ని ఫైనల్స్‌ ఆడాయి (వేర్వేరుగా, కలిసి).. వాటిలో భారత్‌ ఎన్ని గెలిచింది, ఆస్ట్రేలియా ఎన్ని గెలిచింది అన్న సమాచారం​.    

వివరాల్లోకి వెళితే.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆధ్వర్యంలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు మొత్తం 29 ఫైనల్‌ మ్యాచ్‌లు జరగ్గా, అందులో  భారత్‌ 10 ఫైనల్స్‌లో పాల్గొనగా.. ఆస్ట్రేలియా 11 ఫైనల్‌ మ్యాచ్‌లు ఆడింది. భారత​ ఆడిన 10 ఫైనల్స్‌లో ఐదింట గెలుపొందగా.. ఆసీస్‌ ఆడిన 11 ఫైనల్స్‌లో ఎనిమిదింట విజయం సాధించింది. 

భారత్‌ ఆడిన ఐసీసీ ఫైనల్స్‌..

  1. 1983 వన్డే వరల్డ్‌కప్‌: విండీస్‌పై భారత్‌ గెలుపు
  2. 2000 ఛాంపియన్స్‌ ట్రోఫీ: న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి
  3. 2002 ఛాంపియన్స్‌ ట్రోఫీ: శ్రీలంకతో పాటు సంయుక్త విజేత
  4. 2003 వన్డే వరల్డ్‌కప్‌: ఆస్ట్రేలియా చేతిలో ఓటమి
  5. 2007 టీ20 వరల్డ్‌కప్‌: పాకిస్తాన్‌పై గెలుపు
  6. 2011 వన్డే వరల్డ్‌కప్‌: శ్రీలంకపై గెలుపు
  7. 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ: ఇంగ్లండ్‌పై గెలుపు
  8. 2014 టీ20 వరల్డ్‌కప్‌: శ్రీలంక చేతిలో ఓటమి
  9. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ: పాకిస్తాన్‌ చేతిలో ఓటమి
  10. 2021 డబ్ల్యూటీసీ: న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి

ఆస్ట్రేలియా ఆడిన ఐసీసీ ఫైనల్స్‌..

  1. 1975 వన్డే వరల్డ్‌కప్‌: విండీస్ చేతిలో ఓటమి
  2. 1987 వన్డే వరల్డ్‌కప్‌: ఇంగ్లండ్‌పై గెలుపు
  3. 1996 వన్డే వరల్డ్‌కప్‌: శ్రీలంక చేతిలో ఓటమి
  4. 1999 వన్డే వరల్డ్‌కప్‌: పాకిస్తాన్‌పై గెలుపు
  5. 2003 వన్డే వరల్డ్‌కప్‌: భారత్‌పై గెలుపు
  6. 2006 ఛాంపియన్స్‌ ట్రోఫీ: వెస్టిండీస్‌పై గెలుపు
  7. 2007 వన్డే వరల్డ్‌కప్‌: శ్రీలంకపై గెలుపు
  8. 2009 ఛాంపియన్స్‌ ట్రోఫీ: న్యూజిలాండ్‌‌పై గెలుపు
  9. 2010 టీ20 వరల్డ్‌కప్‌: ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి
  10. 2015 వన్డే వరల్డ్‌కప్‌: న్యూజిలాండ్‌పై గెలుపు
  11. 2021 టీ20 వరల్డ్‌కప్‌: న్యూజిలాండ్‌పై గెలుపు

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)