Miss World Contestants: ఇండియాకు రావటం అదృష్టంగా భావిస్తున్నా
Breaking News
WTC Final: వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు
Published on Fri, 06/18/2021 - 14:51
సౌథాంప్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వరుణుడి ఆటంకం తప్పదని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలే నిజమయ్యాయి. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలుకానుంది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే మొదలైన వర్షం టాస్ సమయానికి మరింత తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు తొలి సెషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Update: Unfortunately there will be no play in the first session on Day 1 of the ICC World Test Championship final. #WTC21
— BCCI (@BCCI) June 18, 2021
ఈ విషయాన్ని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. ప్రస్తుతం సౌథాంప్టన్‌లో జల్లులు పడుతూనే ఉన్నాయి. గ్రౌండ్ సిబ్బంది పిచ్‌తోపాటు మైదానంలోని కొంత భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. కాగా, మ్యాచ్ తొలి రోజు 65 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. వరుణుడి ముప్పు మ్యాచ్ మొత్తానికి(ఐదు రోజులకు) ఉన్నట్లు స్థానిక వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
చదవండి: WTC Final: అద్బుతమైన జట్టుతో ఆడుతున్నాం.. విజయం మాదే
Tags : 1