Breaking News

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు శుభవార్త.. సెంచరీల మోత మోగిస్తున్న యువ ఆల్‌రౌండర్‌

Published on Mon, 05/19/2025 - 13:44

వచ్చే నెలలో (జూన్‌ 11) సౌతాఫ్రికాతో జరుగబోయే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు శుభవార్త అందింది. గాయం కారణంగా ఎనిమిది నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆ జట్టు యువ ఆల్‌రౌండర్‌ కెమరూన్‌ గ్రీన్‌ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌తో గ్రీన్‌ రెండు సెంచరీలు (112, 128) చేశాడు. ఈ టోర్నీలో గ్లోసెస్టర్‌షైర్‌కు ఆడుతున్న గ్రీన్‌ కెంట్‌ జట్టుపైనే రెండు సెంచరీలు చేశాడు. 

తాజా ప్రదర్శనతో గ్రీన్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రత్యర్థి సౌతాఫ్రికాకు గట్టి వార్నింగ్‌ మెసేజ్‌ పంపాడు. గ్రీన్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం కొద్ది రోజుల కింద ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్‌ నిమిత్తం గ్రీన్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ ఆడుతున్నాడు. అతనితో పాటు డబ్ల్యూటీసీ జట్టు సహచర సభ్యుడు మార్నస్‌ లబూషేన్‌ కూడా కౌంటీల్లో ఆడుతున్నాడు. 

అయితే గ్రీన్‌ తరహాలో లబూషేన్‌కు సత్ఫలితాలు రాలేదు. లబూషేన్‌ ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో 0, 4 పరుగులకు ఔటయ్యాడు. మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయిన లబూషేన్‌ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓపెనర్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. గ్రీన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్‌ బ్యూ వెబ్‌స్టర్‌కు తుది జట్టులో ఆవకాశం కల్పించాలంటే లబూషేన్‌ ఓపెనర్‌గా ప్రమోట్‌ కాక తప్పదు. లబూషేన్‌.. వెటరన్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజాతో ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తే.. గ్రీన్‌, వెబ్‌స్టర్‌ ఇద్దరికీ తుది జట్టులో ఛాన్స్‌ దొరుకుతుంది.

ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన వెంటనే సౌతాఫ్రికా కూడా తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బవుమా సారధిగా వ్యవహరించనుండగా.. ఏకంగా ఆరుగురు పేసర్లు (కగిసో రబాడ, లుంగి ఎంగిడి, మార్కో జన్సెన్‌, వియన్‌ ముల్దర్‌, డేన్‌ ప్యాటర్సన్‌, కార్బిన్‌ బాష్‌) ఎంపికయ్యారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌-2025కి ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్‌ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్‌, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.
ట్రావెలింగ్‌ రిజర్వ్‌: బ్రెండన్‌ డాగెట్‌.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎం​గిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్‌.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)