వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేత‌గా సౌతాఫ్రికా..

Published on Sat, 06/14/2025 - 17:16

ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఎంతో మంది దిగ్గజ క్రికెటర్ల చిరకాల స్వప్నం. గత 27 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్‌ ఎట్టకేలకు ఆ జట్టు సొంతమైంది. ఇకపై మేము ఛోకర్స్ కాదు ఛాంపియన్స్ అంటూ క్రికెట్ ప్రపంచానికి స‌ఫారీలు చాటి చెప్పారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. త‌మ సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించింది. ఆసీస్ నిర్ధేశించిన‌ 282 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ప్రోటీస్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.

మార్‌క్ర‌మ్ సూప‌ర్ సెంచ‌రీ..
సౌతాఫ్రికా వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్‌గా నిల‌వ‌డంతో ఆ జ‌ట్టు ఓపెన‌ర్ ఐడైన్ మార్‌క్ర‌మ్‌ది కీల‌క పాత్ర‌. భారీ ల‌క్ష్య చేధ‌న‌లో మార్‌క్ర‌మ్ అద్బుత‌మైన సెంచ‌రీతో మెరిశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ త‌న జ‌ట్టుకు రెండో ఐసీసీ టైటిల్‌ను అందించాడు. అత‌డి ఇన్నింగ్స్‌కు ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు ఆట‌గాళ్లు సైతం ఫిదా అయిపోయారు. ఆఖ‌రిలో ఔట‌య్యి తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తుండగా లార్డ్స్‌లోని ప్రేక్ష‌కులు స్టాండింగ్ ఓవియేష‌న్ ఇచ్చారు. ఓవ‌రాల్‌గా 207 బంతులు ఎదుర్కొన్న మార్‌క్ర‌మ్‌.. 14 ఫోర్ల సాయంతో 136 ప‌రుగులు చేశాడు.

బావుమాది వారియ‌ర్‌..
ఈ మ్యాచ్‌లో మార్‌క్ర‌మ్ సెంచ‌రీ ఎంతో విలువైందో, బావుమా ఇన్నింగ్స్ కూడా వెల‌క‌ట్ట‌లేనిది. తొడ కండరాల గాయంతో బాధ‌ప‌డుతునే త‌న జ‌ట్టు కోసం బావుమా పోరాడాడు. 134 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 66 ప‌రుగులు చేశాడు. మార్‌క్ర‌మ్‌తో క‌లిసి కీల‌క బాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పిన బావుమా.. ద‌క్షిణాఫ్రికాకు రెండో ఐసీసీ టైటిల్‌ను అందించిన కెప్టెన్‌గా చ‌రిత్ర‌కెక్కాడు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టగా, హాజిల్‌వుడ్ క‌మ్మిన్స్ త‌లా వికెట్ సాధించారు.

ఇక ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టెర్‌(72) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్‌ స్మిత్‌(66) రాణించాడు. సఫారీ బౌలర్లలో రబాడ ఐదు వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్‌ మూడు వికెట్లు సాధించాడు. అనంతరం దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. ప్యాట్‌ కమ్మిన్స్‌ 6 వికెట్లు పడగొట్టి ప్రోటీస్‌ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 207 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి సఫారీల ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించి ప్రోటీస్‌ ఛాంపియన్స్‌గా నిలిచింది.

సంక్షిప్త సమాచారం..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌: 212/10
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌: 138/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ స్కోర్‌: 207/10
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ స్కోర్‌: 282/5
ఫలితం: ఆసీస్‌సై 5 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం
మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఐడైన్‌ మార్‌క్రమ్‌
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)