Breaking News

చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. తొలి కెప్టెన్‌గా వరల్డ్‌ రికార్డు

Published on Thu, 06/12/2025 - 20:05

లార్డ్స్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్ట్‌ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ ఆసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కమ్మిన్స్ తన అద్బుత బౌలింగ్‌తో ప్రోటీస్ జట్టు పతనాన్ని శాసించాడు. కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తం ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి బౌలింగ్ దాటికి సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగిన కమ్మిన్స్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

కమ్మిన్స్‌ సాధించిన రికార్డులు ఇవే..
👉అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నమెంట్ ఫైనల్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా కమ్మిన్స్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.

👉ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో కమ్మిన్స్ 78 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(77) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బుమ్రాను కమ్మిన్స్ అధిగమించాడు.

2023-25 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:

78* - పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)

77 - జస్ప్రీత్ బుమ్రా (భారత్‌)

74 - మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)

66 - నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా)

63 - రవిచంద్రన్ అశ్విన్ (భారత్‌)

👉లార్డ్స్ మైదానంలో ఒక  టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా కమ్మిన్స్ (28 పరుగులకు 6 వికెట్లు) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బాబ్ విల్లీస్ పేరిట ఉండేది. 1982లో భారత్‌పై 101 పరుగులిచ్చి విల్లీస్ 6 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శతో విల్లీస్ ఆల్‌టైమ్ రికార్డును కమ్మిన్స్ బ్రేక్ చేశాడు.

లార్డ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌లు

1. పాట్ కమిన్స్ - 2025లో దక్షిణాఫ్రికాపై 28 పరుగులిచ్చి 6 వికెట్లు

2. బాబ్ విల్లీస్ - 1982లో భారత్‌పై 101 పరుగులిచ్చి 6 వికెట్లు

3. డేనియల్ వెట్టోరి - 2008లో పరుగులిచ్చి 5 వికెట్లు

👉ఈ మ్యాచ్‌లో కమ్మిన్స్‌ 300 టెస్టు వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)