Breaking News

WTC Final 2025: కమిన్స్‌ ట్రిపుల్‌ సెంచరీ

Published on Fri, 06/13/2025 - 08:39

లార్డ్స్‌ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్ రసవత్తరంగా సాగుతుంది. తొలి రెండు రోజుల్లోనే ఇరు జట్లకు చెందిన 28 వికెట్లు కూలడంతో మ్యాచ్‌ నువ్వా నేనా అన్నట్లు మారింది. ప్రస్తుతానికి ఆసీస్‌ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తున్నా, నిలబెట్టుకుంటుందన్న గ్యారెంటీ లేదు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. మిచెల్‌ స్టార్క్‌ (16), నాథన్‌ లియోన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

43/4 వద్ద రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌతాఫ్రికా మరో 95 పరుగులు మాత్రమే జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది. బెడింగ్హమ్‌ 45, బవుమా 36 పరుగులు చేసి సౌతాఫ్రికాను మూడంకెల స్కోర్‌ దాటించారు. వీరు కాక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వెర్రిన్‌ (13), రికెల్టన్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. మార్క్రమ్‌ (0), ముల్దర్‌ (6), స్టబ్స్‌ (2),జన్సెన్‌ (0), మహారాజ్‌ (7), రబాడ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

కమిన్స్‌ 6 వికెట్లతో చెలరేగిపోయి ప్రొటీస్‌ పతనాన్ని శాశించాడు. సౌతాఫ్రికాను స్వల్ప స్కోర్‌కు కట్టడి చేయడంలో స్టార్క్‌ (2/41), హాజిల్‌వుడ్‌ (1/27) కూడా తలో చేయి వేశారు. 74 పరుగుల ఆధిక్యంతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా సఫారీ బౌలర్ల ధాటికి వణికింది. ఆ జట్టును అలెక్స్‌ క్యారీ (43) అదుకున్నాడు. స్టార్క్‌ ఆసీస్‌ను 300 పరుగుల టార్గెట్‌ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో క్యారీ, స్టార్క్‌ కాకుండా లబూషేన్ (22), స్టీవ్‌ స్మిత్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఉస్మాన్‌ ఖ్వాజా 6, గ్రీన్‌ 0, హెడ్‌ 9, వెబ్‌స్టర్‌ 9, కమిన్స్‌ 6 పరుగులకు ఔటయ్యారు. సఫారీ బౌలర్లలో రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌కు చుక్కలు చూపించారు. జన్సెన్‌, ముల్దర్‌ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. రబాడ (5/51), జన్సెన్‌ (3/49),  కేశవ్‌ మహారాజ్‌ (1/19), మార్క్రమ్‌ (1/5) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (66), బ్యూ వెబ్‌స్టర్‌ (72) అర్ద సెంచరీలతో ఆదుకోవడంతో ఆసీస్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

మిగతా ఆసీస్‌ బ్యాటర్లలో అలెక్స్‌ క్యారీ (23), లబూషేన్‌ (17), ట్రవిస్‌ హెడ్‌ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. గ్రీన్‌ (4), కమిన్స్‌ (1), స్టార్క్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఉస్మాన్‌ ఖ్వాజా, నాథన్‌ లియోన్‌ డకౌట్లయ్యారు.

కమిన్స్‌ ట్రిపుల్‌ సెంచరీ
తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టిన ఆసీస్‌ సారధి కమిన్స్‌.. ఈ ప్రదర్శన అనంతరం పలు రికార్డులు సాధించాడు. ఈ ప్రదర్శనతో కమిన్స్‌ టెస్ట్‌ల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ మైలురాయిని తాకిని 40వ బౌలర్‌గా.. ఎనిమిదో ఆసీస్‌ బౌలర్‌గా.. ఓవరాల్‌గా 30వ పేసర్‌గా.. ఆరో ఆసీస్‌ పేసర్‌గా పలు ఘనతలు సాధించాడు.

ఈ ప్రదర్శనతో కమిన్స్‌ సాధించిన మరిన్ని రికార్డులు ఇవే..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నమెంట్ ఫైనల్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా కమ్మిన్స్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో కమ్మిన్స్ 78 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(77) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బుమ్రాను కమ్మిన్స్ అధిగమించాడు.

లార్డ్స్ మైదానంలో ఒక  టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా కమ్మిన్స్ (28 పరుగులకు 6 వికెట్లు) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బాబ్ విల్లీస్ పేరిట ఉండేది. 1982లో భారత్‌పై 101 పరుగులిచ్చి విల్లీస్ 6 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శతో విల్లీస్ ఆల్‌టైమ్ రికార్డును కమ్మిన్స్ బ్రేక్ చేశాడు.

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు