Breaking News

WTC Final: కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డుపై కన్నేసిన ట్రవిస్‌ హెడ్‌

Published on Wed, 06/11/2025 - 12:50

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్‌ మైదానంలో ఇవాళ (జూన్‌ 11) మధ్యాహ్నం 3 గంటలకు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులు ఏంటో చూద్దాం.

కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డుపై కన్నేసిన హెడ్‌
ఈ మ్యాచ్‌లో (రెండు ఇన్నింగ్స్‌ల్లో) ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్‌ హెడ్‌ 94 పరుగులు చేస్తే ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లి రికార్డును బద్దలు కొడతాడు. విరాట్‌ ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో ఇప్పటివరకు 411 పరుగులు చేయగా.. ట్రవిస్‌ హెడ్‌ ఖాతాలో ప్రస్తుతం 318 పరుగులు (కేవలం 3 ఇన్నింగ్స్‌ల్లోనే) ఉన్నాయి.

బుమ్రా రికార్డుకు ఎసరు పెట్టిన కమిన్స్‌, స్టార్క్‌
నేటి నుంచి ప్రారంభం కాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌ స్పీడ్‌స్టర్లు పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ ఐదు, ఆరు వికెట్లు తీస్తే, ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో (2023-2025) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా అవతరిస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు భారత పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా పేరిట ఉంది. బుమ్రా ఈ సైకిల్‌లో 77 వికెట్లు తీయగా.. కమిన్స్‌ 73, స్టార్క్‌ 72 వికెట్లు తీశారు.

చరిత్ర సృష్టించనున్న బవుమా
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా మరో 46 పరుగులు చేస్తే (రెండు ఇన్నింగ్స్‌ల్లో) డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు మాజీ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ పేరిట ఉంది. ఎల్గర్‌ డబ్ల్యూటీసీలో 1935 పరుగులు చేయగా.. ప్రస్తుతం బవుమా ఖాతాలో 1890 పరుగులు ఉన్నాయి. 

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే బవుమా మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక విజయాలు సాధించిన సౌతాఫ్రికా కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు డీన్‌ ఎల్గర్‌, బవుమాల పేరిట సంయుక్తంగా ఉంది. ఇద్దరు తలో 8 విజయాలు సాధించారు.

లియోన్‌ ఊరిస్తున్న అశ్విన్‌ రికార్డు
ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేస్తే డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డును లియోన్‌ టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌తో కలిసి షేర్‌ చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఇద్దరు తలో 11 ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.

చరిత్ర సృష్టించేందుకు 2 వికెట్ల దూరంలో ఉన్న మహారాజ్‌
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ రెండు వికెట్లు తీస్తే.. సౌతాఫ్రికా టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం మహారాజ్‌ ఖాతాలో 198 వికెట్లు ఉన్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)