Breaking News

రెజ్లింగ్‌ ఫ్యాన్స్‌కు బిగ్‌ షాక్‌!

Published on Mon, 04/20/2026 - 07:46

డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్‌ అభిమానులకు బిగ్‌ షాక్‌ తగిలింది. స్టార్‌ రెజ్లర్‌ బ్రాక్ లెస్నర్ (Brock Lesnar) అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించారు. రెజ్లిమేనియా 42 ఈవెంట్‌లో భాగంగా.. యువ రెజ్లర్‌ ఒబా ఫెమి చేతిలో లెస్నర్‌ ఓటమి పాలయ్యాడు. తదనంతరం లెస్నర్‌ చర్యతో ఫ్యాన్స్‌ దిగ్భ్రాంతికి లోనయ్యారు.  

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(WWE) అనేది ‘స్క్రిప్టెడ్‌ రెజ్లింగ్‌’ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఫైటింగ్‌లో పాల్గొనే రెజ్లర్లు నిపుణుల సమక్షంలోనే ప్రాక్టీస్‌ చేసి స్టేజ్‌ ప్రదర్శనలు ఇస్తుంటారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం వేకువ జామున నెవెడా స్టేట్‌ లాస్‌ వెగాస్‌లో అలెజెయింట్‌ స్టేడియం వేదికగా  రెజ్లిమేనియా 42 మెయిన్‌ ఈవెంట్‌ జరిగింది. అయితే.. ఆద్యంతం ఆకట్టుకుంటుందని భావించిన లెస్నర్‌-ఒబా మ్యాచ్‌.. నిమిషాల వ్యవధిలో ముగియడం రెజ్లింగ్‌ ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. 

డబ్ల్యూడబ్ల్యూఈలో ఇంతకాలం పవర్‌హౌస్‌గా పేరున్న లెస్నర్‌ ఏ దశలోనూ ఒబాకు పోటీ ఇవ్వలేకపోయాడు. తన ఫినిషింగ్‌ మూవ్‌ ఎఫ్‌-5 ఇచ్చినా.. ఒబా ఫెమి లేచి నిల్చోవడంతో అంతా షాక్‌లో ఉండిపోయారు. ఆ వెంటనే తన పవర్‌ బాంబ్‌ మూవ్‌తో ఒబా మ్యాచ్‌ను ముగించాడు. 

48 ఏళ్ల వయసున్న బ్లాక్‌ లెస్నర్‌.. 27 ఏళ్ల నైజీరియా రెజ్లర్‌ ఒబా ఫెమి చేతిలో ఓటమితో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆ వెంటనే స్టేజ్‌పైనే కూర్చుండిపోయిన లెస్నర్‌ తన గ్లౌస్‌, షూస్‌ను వదిలి అక్కడి ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వీడ్కోలు సందేశం ఇచ్చాడు. తన మేనేజర్‌ పాల్‌ హేమన్‌ను కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ పరిణామాలు లెస్నర్‌ డబ్ల్యూడబ్ల్యూఈ కెరీర్ ముగింపు కావచ్చని భావిస్తున్నప్పటికీ.. ఈ ఏడాది సమ్మర్‌స్లామ్‌ ఈవెంట్‌లో లెస్నర్‌ చివరి మ్యాచ్‌ అడొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇక.. డబ్ల్యూడబ్ల్యూఈకే ప్రధాన ఈవెంట్‌గా చెప్పుకునే రెజ్లిమేనియా ఈసారి చప్పగా సాగింది. ఏప్రిల్ 18–19 తేదీల్లో రెండు రోజులపాటు సాగాయి మ్యాచ్‌లు. లక్ష మందికి పైగా అభిమానులు హాజరైన ఈ ఈవెంట్‌కు రెజ్లర్‌(రిటైర్డ్‌)-యాక్టర్‌ జాన్‌ సీనా హోస్ట్‌గా వ్యవహరించాడు. అయితే మ్యాచ్‌ ఫలితాలు చాలా వరకు అభిమానులు పెదవి విరుస్తున్నారు. మరీ ముఖ్యంగా లెస్నర్‌ను అంత దారుణంగా ఓడిపోయేలా స్క్రిప్ట్‌ రాయడంపై మండిపడుతున్నారు. 

అన్‌డిస్‌ప్యుటెడ్‌ చాంపియన్‌షిప్‌ కోసం జరిగిన మ్యాచ్‌లో కోడి రోడ్స్.. రాండీ ఆర్టన్‌ను ఓడించాడు. తద్వారా కోడి రోడ్స్‌ తన చాంపియన్‌షిప్‌ను విజయవంతంగా కాపాడుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌ ఫలితంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రోమన్ రేన్స్, సీఎం పంక్‌ను ఓడించి హెవీవెయిట్‌ టైటిల్‌ను నెగ్గాడు. ఉమెన్స్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోరులో లివ్ మోర్గాన్ స్టెఫనీ వాక్వర్‌పై విజయం సాధించింది. బెక్కీ లించ్, ఏజే లీను ఓడించి ఉమెన్స్‌ ఇంటర్‌కాంటినెంటల్‌ టైటిల్‌ను గెలుచుకుంది. 

జేకబ్ ఫాటూ, డ్రూ మెక్‌ఇంటైర్‌పై విజయం సాధించాడు. ఉసోస్ & ఎల్‌ఏ నైట్‌లు ది విజన్‌-ఐషోస్పీడ్‌(ప్రముఖ య్యూట్యూబర్‌)ను ఓడించారు. రియా రిప్లీ, జేడ్ కార్గిల్‌ను ఓడించి మహిళల చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను గెలిచింది. ట్రిక్ విలియమ్స్, సామీ జేన్‌ను ఓడించి యూస్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను గెలిచాడు. ఫిన్ బాలర్, డొమినిక్ మిస్టీరియోను ఓడించాడు. గుంథర్, సెత్ రోలిన్స్‌ను ఓడించాడు. అయితే గుంథర్‌-రోలిన్స్‌ మ్యాచ్‌ ఒక్కటే ఈ ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)