Breaking News

ముంబైపై యూపీ వారియర్స్‌ ఘన విజయం

Published on Sat, 01/17/2026 - 19:58

మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ మూడో ఓటమి చవిచూసింది. శనివారం నవీ ముంబై వేదికగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ముంబై ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. లానింగ్ కేవలం 45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసింది. ఆమెతో పాటు యువ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ సైతం దుమ్ములేపింది. లిచ్‌ఫీల్డ్  37 బంతుల్లో 61 పరుగులు చేసింది.  ముంబై బౌలర్లలో అమేలియా కెర్ 3 వికెట్లు పడగొట్టగా.. స్కివర్ బ్రంట్ రెండు, నికోలా కారీ,మాథ్యూస్‌, అమన్‌జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు.

పోరాడిన ఓడిన ముంబై..
అనంతరం లక్ష్య చేధనలో ముంబై ఘనమైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు హేలీ మథ్యూస్‌(13), సజన(10) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ (15), నాట్ స్కివర్-బ్రంట్ (15) నిరాశపరిచారు.

చివర్లో అమేలియా కెర్(49 నాటౌట్‌) అమంజోత్ కౌర్(41) పోరాడినప్పటికీ జట్టును మాత్రం విజయ తీరాలకు చేర్చలేకపోయారు. యూపీ బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టగా.. క్రాంతి గౌడ్‌, ఎకిలిస్టోన్‌, దీప్తీ శర్మ తలా వికెట్ సాధించారు. కాగా ఈ టోర్నీలో యూపీతో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ముంబై ఓటమి పాలైంది.
చదవండి: కివీస్‌తో మ్యాచ్ వ‌ర‌ల్డ్ ఫైన‌ల్ లాంటిది: మహ్మద్‌ సిరాజ్‌

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)