Breaking News

చెలరేగిన గౌతమి నాయక్‌.. ఆర్సీబీ భారీ స్కోర్‌

Published on Mon, 01/19/2026 - 21:16

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2026లో ఆర్సీబీ తమ జోరును కొనసాగిస్తుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 19) గుజరాత్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ చేసి భారీ స్కోర్‌ చేసింది.

టాస్‌ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన గౌతమి నాయక్‌ ఊహించని రీతిలో చెలరేగింది. 55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 73 పరుగులు చేసింది. స్టార్‌ ప్లేయర్‌ మంధనతో (26) కలిసి మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించింది.

అనంతరం రిచా ఘోష్‌తో (27) కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించింది. గౌతమి నాయక్‌ ఔటయ్యాక ఆఖర్లో రాధా యాదవ్‌ (17), శ్రేయాంక పాటిల్‌ (8) బ్యాట్‌ ఝులిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో గ్రేస్‌ హ్యారిస్‌, జార్జియా వాల్‌ తలో పరుగు చేసి ఔట్‌ కాగా.. డి క్లెర్క్‌ (4), శ్రేయాంక (8) అజేయంగా నిలిచారు.

గుజరాత్‌ బౌలర్లలో కశ్వీ గౌతమ్‌, కెప్టెన్‌ ఆష్లే గార్డ్‌నర్‌ తలో 2 వికెట్లు తీయగా.. రేణుకా సింగ్‌ ఠాకూర్‌, సోఫి డివైన్‌ చెరో వికెట్‌ తీశారు. కాగా, ఈ ఎడిషన్‌లో ఆర్సీబీ వరుసగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, యూపీ వారియర్జ్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఎవరీ గౌతమి నాయక్‌..?
మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల గౌతమి నాయక్‌ను ఆర్సీబీ ఈ సీజన్‌ వేలంలో రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌ (ఆఫ్‌) ఆల్‌రౌండర్‌ అయిన ఈమె​కు దేశవాలీ క్రికెట్‌లో హార్డ్‌ హిట్టర్‌గా పేరుంది. గౌతమి బరోడా, మహారాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించింది. మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌లో రత్నగిరి జెట్స్‌ తరఫున సత్తా చాటి ఆర్సీబీని ఆకర్శించింది. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)