WPL 2025: స్మృతి మంధాన విఫలం.. దంచికొట్టిన ఎలిస్‌ పెర్రీ.. కానీ!

Published on Sat, 03/01/2025 - 21:25

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మహిళల(RCBW) జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌(WPL)-2025లో ఆరంభంలో అదరగొట్టిన ఆర్సీబీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.

గత మూడు మ్యాచ్‌లలో స్మృతి మంధాన(Smriti Mandhana) సేన చేదు అనుభవాలు చవిచూసింది. ముంబై ఇండియన్స్‌ వుమెన్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ.. ఆ తర్వాత యూపీ వారియర్స్‌తో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ దాకా తెచ్చుకుని టై చేసుకుంది. అనంతరం గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన బెంగళూరు జట్టు.. శనివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టింది.

సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో టాస్‌ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌ చేసింది. కెప్టెన్‌, ఓపెనర్‌ స్మృతి మంధాన(8) దారుణంగా విఫలం కాగా.. మరో ఓపెనర్‌ డానియెల్‌ వ్యాట్‌- హాడ్జ్‌(18 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఎలిస్‌ పెర్రీ, రాఘ్వి బిస్త్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దింది.

పెర్రీ 47 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 60 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మరోవైపు.. రాఘ్వి 32 బంతుల్లో 33 పరుగులు చేయగలిగింది. మిగతా వాళ్లలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌(5), కనిక అహుజా(2) చేతులెత్తేయగా.. జార్జియా వారెహాం 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఫలితంగా ఆర్సీబీ 147 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి రెండేసి వికెట్లు కూల్చగా.. మరిజానే కాప్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకుంది.

డబ్ల్యూపీఎల్‌-2025: ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ ఆర్సీబీ వుమెన్‌ తుదిజట్లు
ఢిల్లీ క్యాపిటల్స్‌
మెగ్ లానింగ్ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మరిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్‌ కీపర్‌), నికీ ప్రసాద్, శిఖా పాండే, మిన్ను మణి, నల్లపురెడ్డి చరణి.

ఆర్సీబీ వుమెన్‌
స్మృతి మంధాన (కెప్టెన్‌), డానియల్ వ్యాట్-హాడ్జ్, ఎలిస్‌ పెర్రీ, రాఘ్వి బిస్త్, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), జార్జియా వారెహాం, కిమ్ గార్త్, స్నేహ్‌ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్, ఏక్తా బిష్త్.

చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్‌ మెసేజ్‌!

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)