Breaking News

అభిమాని నుంచి పెళ్లి ప్రపోజల్‌ అందుకున్న ఆర్సీబీ ప్లేయర్‌

Published on Wed, 02/28/2024 - 17:26

మహిళల ఐపీఎల్‌ 2024లో భాగంగా గుజరాత్‌ జెయింట్స్‌-రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 27) మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆర్సీబీ ప్లేయర్‌, టీమిండియా బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శ్రేయాంక పాటిల్‌కు స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. 

ఆర్సీబీ ఇన్నింగ్స్  ఏడో ఓవర్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్యక్తి "Will You Marry Me Shreyanka" (నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రేయాంక) అని రాసి ఉన్న ప్లకార్డ్‌ను ప్రదర్శించాడు. ఆ ప్లకార్డ్‌పై హార్ట్‌ సింబల్‌తో పాటు అతని పేరు కన్నడలో రాసి ఉంది. ఈ సీన్‌ లైవ్‌లోకి రాగానే డగౌట్‌లో ఉన్న ఆర్సీబీ ప్లేయర్లు నవ్వుకున్నారు. క్రీడా ప్రాంగణాల్లో ఇలా జరగడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో క్రీడాకారులు ఇలాంటి ప్రపోజల్స్‌ అందుకున్నారు. గతంలో మాజీ టెన్నిస్‌ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్‌ అందుకున్న పెళ్లి ప్రపోజల్‌ బాగా హైలైట్‌ అయ్యింది. 

బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల శ్రేయాంక (రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌, మిడిలార్డర్‌ బ్యాటర్‌) ఆర్సీబీతో పాటు క​ర్ణాటక, టీమిండియా, గయానా అమెజాన్‌ వారియర్స్‌కు (కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) ప్రాతినిథ్యం వహిస్తుంది. ఈ అమ్మాయి టీమిండియా తరఫున 2 వన్డేలు (4 వికెట్లు), 6 టీ20లు (8 వికెట్లు) ఆడింది. 

కాగా, గుజరాత్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేయగా.. ఆర్సీబీ కేవలం 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రేణుకా సింగ్‌ (4-0-14-2), మోలినెక్స్‌ (4-0-25-3), స్మృతి మంధన (43), సబ్బినేని మేఘన (36 నాటౌట్‌), ఎల్లిస్‌ పెర్రీ (23 నాటౌట్‌) ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు.

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)