కోహ్లికి షాకిచ్చిన ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌..!

Published on Thu, 02/22/2024 - 17:33

ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియల్‌ వాట్‌.. టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లికి షాకిచ్చింది. కోహ్లి గతంలో గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. కోహ్లి బ్యాట్‌పై భారీ అంచనాలు ఉండినప్పటికీ.. దాన్ని కేవలం రెండు సార్లు మాత్రమే వినియోగించానని పేర్కొంది. మహిళల ఐపీఎల్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన వాట్‌ కోహ్లి గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.

మహిళల ఐపీఎల్‌లో యూపీ వారియర్జ్‌కు ఆడుతున్న ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్‌.. గతంలో కోహ్లిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. 2014లో ఆమె బహిరంగంగానే కోహ్లికి మ్యారేజ్‌ ప్రపోజల్‌ పంపింది. నాటి ట్విటర్‌లో ఆమె.. కోహ్లి మ్యారీ మీ అంటూ పోస్ట్‌ చేసింది. ద క్వింట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్‌ మరిన్ని ముచ్చట్లను కూడా షేర్‌ చేసుకుంది.

తన ఫేవరెట్‌ పిచ్‌ ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియమని.. ఫేవరెట్‌ అపోజిషన్‌ భారత్‌ అని.. ఫేవరెట్‌ ఫుడ్‌ బటర్‌ చికెన్‌, మసాలా ఛాయ్‌ అని పేర్కొంది. కాగా, డానీ వాట్‌ ఇంగ్లండ్‌ తరఫున 2 టెస్ట్‌లు, 105 వన్డేలు, 151 టీ20లు ఆడి 4600కు పైగా పరుగులు చేసి 73 వికెట్లు పడగొట్టింది. ఈమె ఖాతాలో 4 సెంచరీలు, 19 అర్దసెంచరీలు ఉన్నాయి. 

ఇదిలా ఉంటే, కొద్ది రోజుల కిందట (ఫిబ్రవరి 15న) విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ఈ బిడ్డకు విరుష్క దంపతులు అకాయ్‌ అని నామకరణం చేశారు. అకాయ్‌కు ముందు కోహ్లి దంపతులకు కుమార్తె పుట్టింది. ఆమెకు వామిక అని నామకరణం చేశారు. మహిళల ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌ రేపటి నుంచి (ఫిబ్రవరి 23) ప్రారంభంకానుంది. 


 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)