Breaking News

స్టన్నింగ్‌ క్యాచ్‌.. హర్మన్‌ కూడా ఊహించి ఉండదు

Published on Sat, 03/18/2023 - 19:20

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిసింది. క్యాచ్‌ తీసుకుంటుందని ఎవరు ఊహించని రీతిలో హర్మన్‌ అందుకోవడంతో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విషయంలోకి వెళితే.. యూపీ ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో హేలీ మాథ్యూస్‌ తొలి బంతిని ఔట్‌సైడ్‌ ఆఫ్‌స్టంప్‌ దిశగా వేసింది. దేవికా డ్రైవ్‌ ఆడే నేపథ్యంలో బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. ఇక్కడే హర్మన్‌ అద్భుతంగా డైవ్‌ చేసి ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ తీసుకుంది.  కాస్త పట్టు తప్పినా బంతి చేజారిపోయేదే. అందుకే క్యాచ్‌ అందుకోగానే హర్మన్‌ కూడా చాలాసేపు బంతిని తన చేతితో పట్టుకొని గ్రౌండ్‌లో తిరిగింది.  

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్‌ విజయాన్ని అందుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్‌ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో ఎసెల్‌స్టోన్‌ సిక్సర్‌ కొట్టి జట్టును గెలిపించింది. అంతకముందు గ్రేస్‌ హారిస్‌ 38, తాహిలా మెక్‌గ్రాత్ 39 పరుగులు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ విజయంతో యూపీ వారియర్జ్‌ తన ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

చదవండి: Deepthi Sharma: చరిత్రలో నిలిచిపోయే రనౌట్‌..

ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్‌ విజయం; ముంబైకి తొలి ఓటమి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)