Breaking News

WPL 2023: వేలంలో అత్యధిక ధర పలికిన తెలుగు క్రికెటర్‌? ఎవరు ఏయే జట్లకు ఆడబోతున్నారంటే..

Published on Tue, 02/14/2023 - 09:16

Women Cricketers From Telugu States In WPL 2023: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలం-2023లో ఆరుగురు తెలుగు అమ్మాయిలు మంచి ధర దక్కించుకున్నారు. అంజలి శర్వాణి, సబ్బినేని మేఘన, షబ్నమ్‌ షకీల్‌, సొప్పదండి యషశ్రీ, అరుంధతి రెడ్డి, స్నేహ దీప్తి ఆటతో సత్తా చాటి ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించారు. వేలంలో వీరికి పలికిన ధర, వీరు ఏయే జట్లకు ఆడబోతున్నారన్న అంశాలు సంక్షిప్తంగా..

అంజలి శర్వాణి
►లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌. కర్నూల్‌ జిల్లా ఆదోని స్వస్థలం. భారత్‌ తరఫున 6 టి20లు మ్యాచ్‌లు ఆడింది.
►జట్టు: యూపీ వారియర్జ్‌
►ధర: 55 లక్షలు

సబ్బినేని మేఘన
►బ్యాటర్, స్వస్థలం విజయవాడ. భారత్‌ తరఫున 3 వన్డేలు, 17 టి20 మ్యాచ్‌లు ఆడింది.  
►జట్టు: గుజరాత్‌ జెయింట్స్‌
►ధర: రూ.30 లక్షలు 

షబ్నమ్‌ షకీల్‌
►రైట్‌ ఆర్మ్‌ పేస్‌ బౌలర్‌. స్వస్థలం విశాఖపట్నం. ఇటీవల అండర్‌–19 ప్రపంచకప్‌లో ఆడింది.  
►జట్టు- గుజరాత్‌ జెయింట్స్‌
►ధర: రూ.10 లక్షల   

సొప్పదండి యషశ్రీ
►పేస్‌ బౌలర్‌. హైదరాబాద్‌ స్వస్థలం. ఇటీవల అండర్‌–19 ప్రపంచ కప్‌లో ఆడింది.  
►జట్టు: యూపీ వారియర్స్‌ 
►ధర: రూ.10 లక్షలు

అరుంధతి రెడ్డి
►రైట్‌ ఆర్మ్‌ పేస్‌ బౌలర్‌. స్వస్థలం హైదరాబాద్‌. భారత్‌ తరఫున 26 టి20లు ఆడింది.  
►జట్టు: ఢిల్లీ క్యాపిటల్స్‌
►ధర:  రూ.30 లక్షలు

వి. స్నేహ దీప్తి
►బ్యాటర్‌. స్వస్థలం విశాఖపట్నం. భారత్‌ తరఫున 1 వన్డే, 2 టి20లు ఆడింది.  
►జట్టు: ఢిల్లీ క్యాపిటల్స్‌
►ధర: రూ.30 లక్షలు.
వీరిలో అంజలి శర్వాణి అత్యధికంగా 55 లక్షలు పలికింది. ఇదిలా ఉంటే... అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌-2023లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి, భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష మాత్రం వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది.

చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్‌ విషయంలో మాత్రం..
WPL Auction 2023: అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయిన తెలంగాణ అమ్మాయి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)