నేను గనుక సూర్యకి బౌలింగ్‌ చేసే ఉంటేనా: హార్దిక్‌ పాండ్యా

Published on Sun, 01/08/2023 - 17:07

స్వదేశంలో టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా తొలి టీ20 సిరీస్‌ విజయాన్ని నమోదు చేశాడు. శనివారం రాజ్‌కోట్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 91 పరుగుల తేడాతో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.

ఇక​ ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య సెంచరీ సాధిచాడు. ఓవరాల్‌గా 51 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబైకర్‌.. 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ అనంతరం  సూర్యకుమార్‌ను భారత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ప్రశంసలతో ముంచెత్తాడు. 

పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో హార్దిక్‌ మాట్లాడుతూ.. "సూర్యకుమార్‌ తన విధ్వంసకర ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడు అంత సులభంగా ఎలా బ్యాటింగ్‌ చేయగల్గుతున్నాడో అర్ధం కావడం లేదు. ఒక వేళ నేను బౌలర్‌ అయివుంటే అతడు ఆడే షాట్‌లకు ఖచ్చితంగా భయపడేవాడిని.

ఎందుకుంటే ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన షాట్లు అలా వున్నాయి. మైదానం నలుమూలల సూర్య షాట్లు ఆడాడు. అదే విధంగా రాహుల్‌ త్రిపాఠి కూడా అద్భుతంగా ఆడాడు. తొలుత పిచ్‌ బౌలర్లకు సహకరించినప్పటికీ.. పవర్‌ప్లేలో త్రిపాఠి చాలా దూకుడుగా ఆడాడు. అనంతరం సూర్య తన పనిని తను పూర్తి చేసుకుపోయాడు" అని పేర్కొన్నాడు.
చదవండి: IND vs SL: డివిలియర్స్‌, క్రిస్ గేల్‌తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)