Breaking News

చెన్నైకి చేరుకున్న గుకేశ్‌.. వరల్డ్‌ చాంపియన్‌ భావోద్వేగం

Published on Mon, 12/16/2024 - 14:31

ప్రపంచ చెస్‌ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ స్వదేశానికి తిరిగి వచ్చాడు. చదరంగ రారాజు హోదాలో తొలిసారి భారత్‌లో అడగుపెట్టాడు. ఈ వరల్డ్‌ చాంపియన్‌ సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు.

నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారు
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ అధికారులు, జాతీయ చెస్‌ సమాఖ్య ముఖ్యులు, అభిమానులు గుకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా... గుకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘సొంతగడ్డ మీద తిరిగి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. 

మీ అభిమానం, మద్దతు చూసిన తర్వాత.. భారత్‌కు ఈ విజయం ఎంతటి గొప్ప అనుభూతిచ్చిందో నాకు మరింతగా అర్థమైంది. మీరంతా అత్యద్భుతం. నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. 

కాగా భారత్‌ తరఫున వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచిన రెండో ఆటగాడిగా పద్దెమినిదేళ్ల గుకేశ్‌ చరిత్రకెక్కాడు. చెన్నైకే చెందిన విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఈ ఘనత సాధించాడు. 

అంతేకాదు.. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ చాంపియన్‌ అయిన చెస్‌ ప్లేయర్‌గానూ రికార్డు సాధించాడు. సింగపూర్‌ సిటీలో ఇటీవల జరిగిన క్లాసికల్‌ ఫార్మాట్‌లో  గుకేశ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 

డిఫెండింగ్‌ చాంపియన్‌ను ఓడించి
డిఫెండింగ్‌ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌ను ఓడించి చాంపియన్‌ కిరీటాన్ని అందుకున్నాడు. 32 ఏళ్ల  లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో 7.5–6.5 పాయింట్ల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 58 ఎత్తుల్లో లిరెన్‌ ఆట కట్టించి విజేతగా అవతరించాడు

భారీ నజరానా
ఈ నేపథ్యంలో దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక వరల్డ్‌ చాంపియన్‌గా ట్రోఫీతో పాటు గుకేశ్‌ 13 లక్షల 50 వేల డాలర్ల(రూ.11.45 కోట్లు) ప్రైజ్‌మనీ పొందాడు. 

ఇక తమ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకువచ్చిన గుకేశ్‌ను కొనియాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ భారీ నజరానా ప్రకటించారు. గుకేశ్‌కు రూ. ఐదు కోట్ల క్యాష్‌ రివార్డు అందచేస్తామని తెలిపారు. 

చదవండి: WPL 2025 Auction: ఆశ్చర్యం.. అనూహ్యం.. వారిపై కోట్ల వర్షం! వీరికి మొండిచేయి

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)