వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచిన పాకిస్తాన్‌.. ఈసారి విండీస్‌పై విజయం

Published on Fri, 07/05/2024 - 07:04

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ టోర్నీలో పాకిస్తాన్‌ ఛాంపియన్స్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయం​ సాధించిన పాక్‌.. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించింది. బర్మింగ్హమ్‌ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 29 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన విండీస్‌ 165 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమతమై ఓటమిపాలైంది.

రాణించిన షోయబ్‌ మాలిక్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ షోయబ్‌ మాలిక్‌ (41 బంతుల్లో 54; 5 ఫోర్లు, సిక్స్‌), షర్జీల్‌ ఖాన్‌ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో భారీ స్కోర్‌ చేసింది. ఆఖర్లో ఆమిర్‌ యామిన్‌ (11 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌ ఝులిపించాడు. విండీస్‌ బౌలర్లలో ఆష్లే నర్స్‌ 3, ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌ 2, శామ్యుల్‌ బద్రీ, జేరోమ్‌ టేలర్‌, సులేమాన్‌ బెన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

నిప్పులు చెరిగిన సోహైల్‌ తన్వీర్‌.. సత్తా చాటిన అఫ్రిది
195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. సోహైల్‌ తన్వీర్‌ (4-0-14-4), షాహిద్‌ అఫ్రిది (3/31), వాహబ్‌ రియాజ్‌ (2/18) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్‌ చేసి 165 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో డ్వేన్‌ స్మిత్‌ (46 బంతుల్లో 65;8 ఫోర్లు, 2 సిక్సర్లు), జోనాథన్‌ కార్టర్‌ (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించినా ఉపయోగం లేకుండా పోయింది.

 

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)