Breaking News

Womens T20 World Cup: వేలంపై కాదు... పాక్‌తో సమరంపైనే దృష్టి

Published on Mon, 02/06/2023 - 04:47

కేప్‌టౌన్‌: మహిళల టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగే సమరంపైనే తాము దృష్టి పెట్టామని, మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) కోసం నిర్వహించే వేలంపై ఆలోచించడం లేదని భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేర్కొంది. దక్షిణాఫ్రికా గడ్డపై అండర్‌–19 అమ్మాయిల జట్టు సాధించిన వరల్డ్‌కప్‌ స్ఫూర్తితో తమ ప్రపంచకప్‌ వేట సాగుతుందని చెప్పింది. మెగా ఈవెంట్‌లో హర్మన్‌ సేన 12న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాక్‌లో తలపడుతుంది. మరుసటి రోజే ముంబైలో మహిళా క్రికెటర్ల వేలం కార్యక్రమం జరుగుతుంది.

ఆదివారం జట్టు కెప్టెన్లతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్మన్‌ మాట్లాడుతూ ‘ప్రపంచకప్పే అన్నింటికంటే ముఖ్యమైంది. దాని తర్వాతే ఏదైనా..! ఐసీసీ మెగా ఈవెంట్‌పైనే మేం దృష్టి సారించాం. మిగతావి ఎప్పుడూ ఉండేవే. ఓ క్రికెటర్‌గా ఏది ప్రధానమో ఏది అప్రధానమో నాకు బాగా తెలుసు. దేనిపై దృష్టి సారించాలో కూడా తెలుసు. గత నెల షఫాలీ వర్మ నేతృత్వంలోని అండర్‌–19 మహిళల జట్టు సాధించిన వరల్డ్‌కప్‌ను మేమంతా చూశాం.

జూనియర్‌ టీమ్‌ స్ఫూర్తితో మేం కూడా ప్రపంచకప్‌ సాధించాలనే పట్టుదలతో ఉన్నాం’ అని వివరించింది. అలాగే దేశంలో జరిగే మహిళల లీగ్‌లతో జాతీయ జట్లకు చాలా మేలు జరుగుతుందని చెప్పింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ దేశాల్లో జరుగుతున్న లీగ్‌లతో ఆ జట్లు ఏ స్థాయిలో ఉన్నాయో... అలాగే డబ్ల్యూపీఎల్‌తో మన జాతీయ జట్టు, అమ్మాయిలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని, నాణ్యమైన విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడటం వల్ల నైపుణ్యం పెరుగుతుందని భారత కెప్టెన్‌ తెలిపింది.

వేలం ఇబ్బందికరమే
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సారథులు ప్రపంచకప్‌ సమయంలోనే క్రికెటర్ల వేలం జరగనుండటం ఇబ్బందికరమని అభిప్రాయపడ్డారు. ‘కొందరు క్రికెటర్లు వేలంలో అమ్ముడుపోతారు. మరికొందరేమో మిగిలిపోతారు. ఇంకొందరికి ఎక్కువ ధర, కొందరికి తక్కువ ధర లభిస్తుంది. ఇది క్రికెటర్ల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది’ అని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ సోఫీ డివైన్‌ పేర్కొంది. ఆసీస్‌ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ మాట్లాడుతూ ‘నిజంగా ఇది (వేలం) ఇబ్బందికర పరిణామమే. ప్రపంచకప్‌లో ఆడేందుకు వచ్చిన అమ్మాయిలను తప్పకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొందరు జీర్ణించుకుంటారు. ఇంకొందరు జీర్జించుకోలేరు. ఇది కాస్త ఆటపై ప్రభావం చూపుతుంది’ తెలిపింది. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)