Breaking News

T20 World Cup 2024: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన విండీస్‌

Published on Fri, 10/11/2024 - 16:10

మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (అక్టోబర్‌ 10) జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్‌ నిగార్‌ సుల్తాన్‌ (39) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. దిలారా అక్తెర్‌ (19), శోభన (16), రితూ మోనీ (10) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్‌ బౌలర్లలో కరిష్మా రామ్హరాక్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి (4-0-17-4) బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టింది. అఫీ ఫ్లెచర్‌ 2, హేలీ మాథ్యూస్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌ 12.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. హేలీ మాథ్యూస్‌ 34, స్టెఫానీ టేలర్‌ 27, షెమెయిన్‌ క్యాంప్‌బెల్‌ 21, డియాండ్రా డొట్టిన్‌ 19, చిన్నెల్‌ హెన్రీ 2 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో నహిద అక్తెర్‌, మరుఫా అక్తెర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో వెస్టిండీస్‌ గ్రూప్‌-బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా..స్కాట్లాండ్‌ ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది.

ఇదిలా ఉంటే, గ్రూప్‌-ఏలో పోటీలు అత్యంత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా టాప్‌లో ఉండగా.. భారత్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. ఈ గ్రూప్‌లో సెమీస్‌ బెర్త్‌ల కోసం నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. గ్రూప్‌ మ్యాచ్‌లు ముగిసిన అనంతరం టాప్‌-2లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. భారత్‌ తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ అక్టోబర్‌ 13న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెమీస్‌కు చేరవచ్చు. 

చదవండి: ఇంగ్లండ్‌ చేతిలో ఘోర ఓటమి.. చివరి స్థానానికి పడిపోయిన పాకిస్తాన్‌

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)