లంక బౌలర్ల విజృంభణ.. 116 పరుగులకే కుప్పకూలిన పాక్‌

Published on Thu, 10/03/2024 - 21:19

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్‌ 3) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. లంక బౌలర్లు మూకుమ్మడిగా రాణించిన పాక్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. లంక బౌలర్ల ధాటికి 116 పరుగులకు ఆలౌటైంది. 

సుగంధిక కుమారి, ఉదేషిక ప్రభోదని, చమారీ ఆటపట్టు తలో మూడు వికెట్లు తీసి పాక్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. కవిష దిల్హరి ఓ వికెట్‌ తీసింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ఫాతిమా సనా 30 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. నిదా దార్‌ (23), మునీబా అలీ (11), సిద్రా అమిన్‌ (12), ఒమైమా సొహైల్‌ (18) రెండంకెల స్కోర్లు చేశారు. గుల్‌ ఫెరోజా (2), తుబా హసన్‌ (5), అలియా రియాజ్‌ (0), డయానా బేగ్‌ (2), సదియా ఇక్బాల్‌ (2) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై బంగ్లాదేశ్‌ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన స్కాట్లాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.

చదవండి: బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. తెలుగు కుర్రాడికి అవకాశం లేనట్లే..!

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)