Breaking News

టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ ఔట్‌

Published on Sun, 10/13/2024 - 16:19

మహిళల టీ20 ప్రపంచకప్‌-2024 నుంచి మరో జట్టు నిష్క్రమించింది. గ్రూప్‌-బి నుంచి బంగ్లాదేశ్‌ జట్టు ఎలిమినేట్‌ అయ్యింది. నిన్న సౌతా‌ఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడటంతో బంగ్లాదేశ్‌ ఇంటిబాట పట్టింది. ఈ గ్రూప్‌ నుంచి స్కాట్లాండ్‌ ఇదివరకే ఎలిమినేట్‌ అయ్యింది.

సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. శోభన మోస్తరి (38), నిగార్‌ సుల్తానా (32 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మారిజన్‌ కాప్‌, డెర్క్‌సెన్‌, మ్లాబా తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. తంజిమ్‌ బ్రిట్స్‌ (42) రాణించడంతో 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అన్నెకె బోష్‌ (25) ఓ మోస్తరు పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో ఫహిమా ఖాతూన్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. రితే మోనీ ఓ వికెట్‌ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సౌతాఫ్రికా అగ్రస్థానానికి (గ్రూప్‌-బి పాయింట్ల పట్టికలో) చేరుకుంది. వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

చదవండి: డీఎస్పీగా బాధ్య‌త‌లు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్‌! ఫోటో వైర‌ల్‌

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు