Breaking News

టీమిండియా ముందు నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచిన ఆస్ట్రేలియా

Published on Sun, 10/13/2024 - 21:18

మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్‌ 13) జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోర్‌కు పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 

గ్రేస్‌ హ్యారిస్‌ (40), తహ్లియా మెక్‌గ్రాత్‌ (32), ఎల్లిస్‌ పెర్రీ (32), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (15 నాటౌట్‌), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (10) రెండంకెల స్కోర్లు చేయగా.. బెత్‌ మూనీ (2), జార్జియా వేర్హమ్‌ (0), ఆష్లే గార్డ్‌నర్‌ (6), సోఫీ మోలినెక్స్ (0) పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్‌, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్‌, పూజా వస్త్రాకర్‌, రాధా యాదవ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

కాగా, సెమీస్‌కు చేరాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. పాకిస్తాన్‌ తమ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడిస్తే.. అప్పుడు భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ తలో నాలుగు పాయింట్లతో సెమీస్‌ రేసులో ఉంటాయి. 

అప్పుడు నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఒకవేళ న్యూజిలాండే పాకిస్తాన్‌ను ఓడిస్తే భారత్‌ సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి భారత్‌ ఎట్టి పరిస్థితుల్లో నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి తీరాలి.

తుది జట్లు..
ఆస్ట్రేలియా: బెత్ మూనీ(వికెట్‌కీపర్‌), గ్రేస్ హారిస్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లే గార్డ్‌నర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్(కెప్టెన్‌), జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ మోలినెక్స్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్

భారత్‌: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్

చదవండి: స్కాట్లాండ్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్‌

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు