Breaking News

నరాలు తెగే ఉత్కంఠ: పాక్‌ను ఓడించిన లంక.. ఫైనల్‌కు సై

Published on Sat, 07/27/2024 - 10:30

మహిళల ఆసియా కప్‌-2024 టోర్నీలో శ్రీలంక సత్తా చాటింది. రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో భారత మహిళా క్రికెట్‌ జట్టును ఢీకొట్టనుంది. డంబుల్లా వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక.. పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

నిదా రాణించినా
ఈ క్రమంలో ఓపెనర్లు గుల్‌ ఫెరోజా 25, మునీబా అలీ 37 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ అమీన్‌(10) పూర్తిగా నిరాశపరిచింది. కెప్టెన్‌ నిదా దర్‌ 17 బంతుల్లో 23 పరుగులతో రాణించగా.. అలియా రియాజ్‌(16), ఫాతిమా సనా(23) ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పాకిస్తాన్‌ 140 పరుగులు చేసింది.

శ్రీలంక బౌలర్లలో ప్రభోదని, కవిషా దిల్హారీ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సైదా ఇక్బాల్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ విష్మీ గుణరత్నె డకౌట్‌గా వెనుదిరిగింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హర్షిత విక్రమసింహ సైతం సైదా బౌలింగ్‌లో 12 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. మరో ఓపెనర్‌ చమరి ఆటపట్టు  మాత్రం హాఫ్‌ సెంచరీతో అదరగొట్టింది.

నలభై ఎనిమిది బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 63 పరుగులు చేసి.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అలరించింది. మిగతావాళ్లలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అనుష్క సంజీవని 24 పరుగులతో రాణించింది. అయితే, ఆఖరి ఓవర్లో లంక విజయానికి 3 పరుగులు అవసరం కాగా.. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి.

తీవ్ర ఉత్కంఠ
ఈ క్రమంలో పాక్‌ కెప్టెన్‌ నిదా దర్‌ డాట్‌ బాల్‌తో ఆరంభించి.. రెండో బంతికే సుగందిక కుమారి(10)ని బౌల్డ్‌ చేసింది. మరుసటి బంతికి కూడా శ్రీలంక పరుగు రాబట్టలేకపోయింది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. నాలుగో బంతికి అచిని కులసూర్య సింగిల్‌ తీసింది. అనంతరం నిదా వైడ్‌ వేయగా.. ఇరు జట్ల స్కోరు సమమైంది. ఈ క్రమంలో ఐదో బంతికి సంజీవని సింగిల్‌ తీయడంతో పాక్‌ కథ సమాప్తమైంది.

ఫైనల్లో భారత్‌తో ఢీ
నిదా దర్‌ బృందంపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆతిథ్య శ్రీలంక ఆసియా టీ20 కప్‌-2024 ఫైనల్‌కు దూసుకువెళ్లింది. టైటిల్‌ కోసం ఆదివారం హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేనతో ఆటపట్టు జట్టు తలపడనుంది. కాగా పాక్‌పై గెలుపు ఖరారు కాగానే లంక ఆటగాళ్ల సంబరం అంబరాన్నంటింది. మైదానంలోకి దూసుకువచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది శ్రీలంక మహిళా క్రికెట్‌ జట్టు. అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న చమరి ఆటపట్టు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకుంది.

చదవండి: ఫైనల్లో టీమిండియా

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)