Breaking News

Ashes Series 2023: ఇంగ్లండ్‌ ఓపెనర్‌ డబుల్‌ సెంచరీ.. ఆసీస్‌కు ధీటుగా..!

Published on Sat, 06/24/2023 - 21:11

మహిళల యాషెస్‌ సిరీస్‌ 2023 ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ ట్యామీ బీమౌంట్‌ డబుల్‌ సెంచరీ సాధించింది. మహిళల క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా, తొలి ఇంగ్లీష్‌ మహిళగా ట్యామీ రికార్డుల్లోకెక్కింది. 317 బంతుల్లో 26 బౌండరీ సాయంతో డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్న ట్యామీ.. కెరీర్‌లో తాను సాధించిన తొలి టెస్ట్‌ శతకాన్నే ద్విశతకంగా మార్చుకుంది.

ఈ మ్యాచ్‌కు ముందు ట్యామీ తన 7 మ్యాచ్‌ల టెస్ట్‌ కెరీర్‌లో కేవలం 2 అర్ధసెంచరీలు మాత్రమే సాధించింది. అయితే ఆమెకు వన్డేల్లో, టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. 103 వన్డేల్లో 9 సెంచరీలు, 17 హాఫ్‌ సెంచరీల సాయంతో 3505 పరుగులు (40.8 యావరేజ్‌తో), 99 టీ20ల్లో సెంచరీ, 10 హాఫ్‌ సెంచరీల సాయంతో 1721 పరుగులు (108.4 స్ట్రయిక్‌రేట్‌తో) సాధించింది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 473 పరుగులకు ఆలౌటైంది. ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన అనాబెల్‌ సదర్‌లాండ్‌ (137) అజేయమైన సెంచరీతో చెలరేగగా.. ఎల్లైస్‌ పెర్రీ (99) ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకుంది. తహిల మెక్‌గ్రాత్‌ (61) అర్ధసెంచరీతో రాణించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఎక్లెస్టోన్‌ 5 వికెట్లు పడగొట్టగా.. లారెన్‌ బెల్‌, లారెన్‌ ఫైలర్‌ తలో 2 వికెట్లు, కేట్‌ క్రాస్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. ఆసీస్‌కు ధీటుగా జవాబిస్తుంది.  ఆ జట్టు మూడో రోజు మూడో సెషన్‌ సమయాని​కి 7 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 25 పరుగులు వెనుకబడి ఉంది. ట్యామీ బీమౌంట్‌ (205), కేట్‌ క్రాస్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. హీథర్‌నైట్‌ (57), నాట్‌సీవర్‌ బ్రంట్‌ (78) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌ 3, తహిల మెక్‌గ్రాత్‌, డార్సీ బ్రౌన్‌, నదర్‌లాండ్‌, పెర్రీ తలో వికెట్‌ పడగొట్టారు. 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)