Breaking News

Ashes 2023: ఇంగ్లండ్‌ బ్యాటర్‌ వరుస శతకాలు.. యాషెస్‌ నిలబెట్టుకున్న ఆసీస్‌

Published on Wed, 07/19/2023 - 08:35

మహిళల యాషెస్‌ సిరీస్‌ను ఆసీస్‌ నిలబెట్టుకుంది. మల్టీ ఫార్మాట్‌లో జరిగిన ఈ సిరీస్‌ను ఆసీస్‌ 8-8 పాయింట్లతో సమం చేసుకుంది. నిన్న జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ నెగ్గినప్పటికీ, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఆసీస్‌ టైటిల్‌ నిలబెట్టుకుంది.   

వన్డే సిరీస్‌ ఇంగ్లండ్‌దే..
వర్షం అంతరాయాల నడుమ సాగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 69 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. 

వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ చేసిన నాట్‌ సీవర్‌ బ్రంట్‌..
నాట్‌ సీవర్‌ బ్రంట్‌ వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ (129) చేసి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించింది. అనంతరం ఆసీస్‌ బ్యాటింగ్‌కు దిగే ముందు వర్షం మొదలుకావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 44 ఓవర్లలో 269 పరుగులకు కుదించారు.

చేతులెత్తేసిన ఆసీస్‌..
269 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్‌ చేతులెత్తేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, ఆసీస్‌ను 35.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్‌ చేశారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-1 తేడాతో (రెండో వన్డేలో ఆసీస్‌ గెలుపు) కైవసం చేసుకుంది.

టీ20 సిరీస్‌ కూడా ఇంగ్లండ్‌దే..
వన్డే సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ను ఆతిధ్య జట్టు 2-1 తేడాతో (తొలి టీ20లో ఆసీస్‌ గెలుపు) గెలుచుకుంది.

ఆసీస్‌ యాషెస్‌ను ఎలా నిలుపుకుందంటే..?
మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో గెలవడంతో ఆసీస్‌ ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. ఆతర్వాత జరిగిన టీ20 సిరీస్‌ను ఆ జట్టు 1-2తో కోల్పోయినప్పటికీ, పాయింట్ల పరంగా (ఒక్కో గెలుపుకు 2 పాయింట్లు) అప్పటికీ ఆధిక్యంలోనే (6-4) ఉండింది. వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-1 తేడాతో చేజిక్కించుకోవడంతో 8-8తో పాయింట్లు సమం అయ్యాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఆసీస్‌ యాషెస్‌ను నిలుపుకుంది.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)