Breaking News

బుమ్రా లేకుంటే వార్‌ వన్‌ సైడే: గ్లెన్‌ మెక్‌గ్రాత్‌

Published on Thu, 01/02/2025 - 07:42

భారత జట్టులో జస్‌ప్రీత్‌ బుమ్రా లేకుండా ‘బోర్డర్‌–గావస్కర్‌’ సిరీస్‌ ఏకపక్షంగా సాగేదని ఆస్ట్రేలియా పేస్‌ దిగ్గజం మెక్‌గ్రాత్‌ పేర్కొన్నాడు. పరిస్థితులను అర్థం చేసుకొని అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచించడంలో బుమ్రా బుర్ర చురుకైందని మెక్‌గ్రాత్‌ కితాబిచ్చాడు.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ముగియగా... టీమిండియా 1–2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు విఫలమైనా... బుమ్రా ఒంటి చేత్తో జట్టును పోటీలో నిలిపాడని మెక్‌గ్రాత్‌ ప్రశంసించాడు. ‘బుమ్రా లేకుండా సిరీస్‌ మరింత ఏకపక్షం అయ్యేది. అతడు టీమిండియాకు ప్రధాన బలం. అతడి బౌలింగ్‌కు నేను పెద్ద అభిమానిని. భారత జట్టు అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి.

భారత్‌లో క్రికెట్‌కు చాలా క్రేజ్‌ ఉంది. గత 12 ఏళ్లుగా ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌ తరఫున భారత్‌లో పనిచేస్తున్నా. మా సంస్థ ద్వారా ప్రసిధ్‌ కృష్ణ, యశస్వి జైస్వాల్‌ వంటి వాళ్లు ఎందరో లబ్ధి పొందారు. క్రికెట్‌లోని అన్నీ ఫార్మాట్లలో టెస్టులే అత్యుత్తమం. మెల్‌బోర్న్‌ టెస్టును ఐదు రోజుల్లో కలిపి 3,70,000 మంది వీక్షించడం ఆనందాన్నిచి్చంది. ఇది టెస్టు క్రికెట్‌కున్న ఆదరణను వెల్లడిస్తుంది’ అని మెక్‌గ్రాత్‌ అన్నాడు.
చదవండి: బుమ్రా ఎడమ చేత్తో బౌలింగ్‌ చేయాలని చట్టం తెస్తాం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)