Breaking News

డబ్ల్యూటీసీ 2021-23 అత్యుత్తమ జట్టు.. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు చోటు

Published on Tue, 03/21/2023 - 12:23

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ సెకెండ్‌ సైకిల్‌ (2021-23)కు సంబంధించి ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ విజ్డెన్‌.కామ్‌ తమ అత్యుత్తమ జట్టును ఇవాళ (మార్చి 21) ప్రకటించింది. డబ్ల్యూటీసీ సీజన్‌-2 ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో విజ్డెన్‌ తమ బెస్ట్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌ వివరాలను మీడియాతో షేర్‌ చేసుకుంది. ఈ జాబితాలో నలుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ముగ్గురు టీమిండియా ప్లేయర్లు, ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా జట్లకు చెందిన ఒక్కొకరికి విజ్డెన్‌ చోటు కల్పించింది. డబ్ల్యూటీసీ సీజన్‌-2లో ప్రదర్శన ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్లు విజ్డెన్‌ వివరించింది.

విజ్డెన్‌ టీమ్‌ ఆఫ్‌ డబ్ల్యూటీసీ 2021-23..

  • ఉస్మాన్‌ ఖ్వాజా (ఆస్ట్రేలియా, 16 మ్యాచ్‌ల్లో 69.91 సగటున 6 శతకాలు, 7 హాఫ్‌సెంచరీ సాయంతో 1608 పరుగులు, అత్యుత్తమ స్కోర్‌ 195*)
  • దిముత్‌ కరుణరత్నే (శ్రీలంక, 12 మ్యాచ్‌ల్లో 47.90 సగటున 2 సెంచరీలు, 8 హాఫ్‌సెంచరీల సాయంతో 1054 పరుగులు, అత్యుత్తమ స్కోర్‌ 147)
  • మార్నస్‌ లబూషేన్‌ (ఆస్ట్రేలియా, 19 మ్యాచ్‌ల్లో 53.89 సగటున 5 సెంచరీలు, 5 హాఫ్‌ సెంచరీల సాయంతో 1509 పరుగులు, అత్యుత్తమ స్కోర్‌ 204)
  • దినేశ్‌ చండీమాల్‌ (శ్రీలంక, 10 మ్యాచ్‌ల్లో 68.42 సగటున 2 సెంచరీలు, 5 హాఫ్‌ సెంచరీల సాయంతో 958 పరుగులు, అత్యుత్తమ స్కోర్‌ 206*)
  • జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్‌, 15 మ్యాచ్‌ల్లో 51.40 సగటున 6 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 1285 పరుగులు, అత్యుత్తమ స్కోర్‌ 162)
  • రిషబ్‌ పంత్‌ (భారత్‌, 12 మ్యాచ్‌ల్లో 43.40 సగటున 2 సెంచరీలు, 5 హాఫ్‌సెంచరీల సాయంతో 868 పరుగులు, అత్యుత్తమ స్కోర్‌ 146)
  • రవీంద్ర జడేజా (భారత్‌, 12 మ్యాచ్‌ల్లో 37.38 సగటున 2 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీల సాయంతో 673 పరుగులు, అత్యుత్తమ స్కోర్‌ 175*, అలాగే 5 ఫైఫర్‌ల సాయంతో 43 వికెట్లు, అత్యుత్తమ ప్రదర్శన 7/42)  
  • పాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా, 15 మ్యాచ్‌ల్లో 21.22 సగటున 53 వికెట్లు, 3 ఫైఫర్లు, అత్యుత్తమ ప్రదర్శన 5/38)
  • కగిసో రబాడ (సౌతాఫ్రికా, 13 మ్యాచ్‌ల్లో 26.97 సగటున 67 వికెట్లు, 3 ఫైఫర్లు, అత్యుత్తమ ప్రదర్శన 6/50)
  • నాథన్‌ లియోన్‌ (ఆస్ట్రేలియా, 19 మ్యాచ్‌ల్లో 26.97 సగటున 83 వికెట్లు, 5 ఫైఫర్లు, అత్యుత్తమ ప్రదర్శన 8/64)
  • జస్ప్రీత్‌ బుమ్రా (భారత్‌, 10 మ్యాచ్‌ల్లో 19.73 సగటున 45 వికెట్లు, 3 ఫైఫర్లు, అత్యుత్తమ ప్రదర్శన 5/24)

కాగా, విజ్డెన్‌ ప్రకటించిన ఈ జాబితాలో ఇంగ్లండ్‌ యువ సంచలనం హ్యారీ బ్రూక్‌, న్యూజిలాండ్‌ మాజీ టెస్ట్‌ సారధి కేన్‌ విలియమ్సన్‌, ఆసీస్‌ తాత్కాలిక కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌, ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ పేర్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. విజ్డెన్‌ జ్యూరీ శ్రీలంక ఆటగాళ్లకు పెద్ద పీట వేయగా.. న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఆటగాళ్లను పూర్తిగా విస్మరించింది. ఇదిలా ఉంటే, జూన్‌ 7 నుంచి ఓవల్‌ వేదికగా వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ జరుగనున్న విషయం తెలిసిందే. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)