Breaking News

Ind vs NZ: ‘రిజర్వ్‌’ నుంచి ‘హీరో’గా మారి... టీమిండియాపై గెలుపులో కీలకంగా

Published on Tue, 11/05/2024 - 04:00

ముంబై: న్యూజిలాండ్‌ బ్యాటర్‌ విల్‌ యంగ్‌ 2020 డిసెంబర్‌లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే భారత్‌తో సిరీస్‌కు ముందు వరకు ఈ నాలుగేళ్లలో అతను 16 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. ప్రతీసారి రిజర్వ్‌ ఆటగాడిగానే ఎంపిక కావడం... విరామంలో సహచరులకు డ్రింక్స్‌ అందించడం మినహా అతనికి చెప్పుకోదగ్గ అవకాశాలే రాలేదు! జట్టులో ఎవరైనా గాయపడితే తప్ప యంగ్‌ పేరును టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి. 

గాయం నుంచి కేన్‌ విలియమ్సన్‌ కోలుకోకపోవడంతో ముందుగా తొలి టెస్టులో చాన్స్‌ లభించింది. ఆ తర్వాత విలియమ్సన్‌ తర్వాతి మ్యాచ్‌లూ ఆడలేడని ఖాయం కావడంతో యంగ్‌ చోటుకు ఢోకా లేకుండా పోయింది. చివరకు సిరీస్‌లో మొత్తం 244 పరుగులు సాధించి కివీస్‌ చారిత్రాత్మక విజయంలో కీలకపాత్ర పోషించిన అతను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా కూడా నిలిచాడు. డ్రింక్స్‌ అందించడమే తనకు అలవాటుగా మారిపోయిందని... ఇప్పుడు టీమ్‌ను గెలిపించడం తనకు గర్వంగా అనిపిస్తోందని విల్‌ యంగ్‌ వ్యాఖ్యానించాడు. 

‘నాలుగేళ్లలో వేర్వేరు కారణాలతో నేను మైదానంలో కంటే బయటే ఎక్కువగా ఉన్నాను. ఎప్పుడూ రిజర్వ్‌ బ్యాటర్‌గానే నా పేరు ఉండేది. జట్టు సభ్యులకు డ్రింక్స్‌ అందించడమే ఒక అనుభవంగా మారిపోయింది. అయితే ఎప్పుడు అవకాశం వచ్చినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించా. విలియమ్సన్‌ స్థానంలో వచ్చి నా అతడిని అనుకరించకుండా నా సొంత ఆటనే ఆడాను. ఇప్పుడు నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది’ అని యంగ్‌ అన్నాడు. భారత్‌ను స్పిన్‌ పిచ్‌లపైనే చిత్తు చేయడం గొప్పగా అనిపించిందని యంగ్‌ చెప్పాడు. 

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు