Breaking News

పాక్‌ సెమీస్‌, ఫైనల్స్‌ను కూడా రద్దు చేసుకుంటుందా..?

Published on Mon, 02/02/2026 - 13:07

టీ20 ప్రపంచకప్‌-2026లో పాకిస్తాన్‌ భారత్‌తో ఆడాల్సిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఒకవేళ పాక్‌ సెమీస్‌లో కాని, ఫైనల్స్‌లో కాని భారత్‌తో తలపడాల్సి వస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇదే విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ వద్ద ప్రస్తావించగా పూర్తి స్పష్టతనిచ్చాడు. 

సెమీఫైనల్ లేదా ఫైనల్‌లో భారత్‌తో తలపడాల్సి వస్తే పాకిస్తాన్‌ తప్పక బరిలోకి దిగుతుందని తేల్చి చెప్పాడు. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఆడేందుకు తమకెలాంటి అభ్యంతరాలు లేవని అన్నాడు. జట్టు శక్తిపై నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ.. భారత్‌ను గెలిచి చూపిస్తామని బీరాలు పలికాడు. ప్రపంచకప్‌ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ అవళంబిస్తున్న ఈ భిన్న వైఖరిపై ఐసీసీతో పాటు క్రికెట్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్‌ దశలో వచ్చే భద్రతా సమస్యలు నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడే సమయంలో ఎదురవ్వవా అని అంటున్నారు. కొందేమో పాక్‌కు నాకౌట్‌ దశకు చేరేంత సీన్‌ లేదని, అందుకే ఈ తలతిక్క డ్రామాలాడుతుందని కామెంట్లు చేస్తున్నారు. అసలు పాక్‌ను ప్రపంచకప్‌ మొత్తం నుంచే బహిష్కరించి, వేరే టీమ్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా, టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా పాకిస్తాన్‌ భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ పాక్‌ ఈ మ్యాచ్‌ను రద్దు చేసుకుంది. తాజాగా ఈ ఒక్క మ్యాచ్‌ మినహా మిగతా మ్యాచ్‌లు తప్పక ఆడతామని స్పష్టం చేసింది. 

పాక్‌ గ్రూప్‌-ఏలో భారత్‌, నమీబియా, నెదర్లాండ్స్‌, యూఎస్‌ఏతో తలపడాల్సి ఉంది. వీరి మిగతా గ్రూప్‌ మ్యాచ్‌లు ఫిబ్రవరి 7 (నెదర్లాండ్స్‌), 10 (యూఎస్‌ఏ), 18 తేదీల్లో (నమీబియా) కొలొంబో వేదికగా జరుగనున్నాయి. ఒకవేళ పాక్‌ గ్రూప్‌ దశ దాటి తదుపరి దశకు చేరితే ఆ మ్యాచ్‌లు కూడా కొలొంబోలోనే జరుగుతాయి.

ఐసీసీ ఆగ్రహం 
పాక్‌ భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ను మాత్రమే రద్దు చేసుకోవడంపై ఐసీసీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా చేయడం క్రీడా సూత్రాలకు విరుద్దమని పేర్కొంది. ఇప్పటికైతే పీసీబీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని తెలిపింది. పీసీబీ నుంచి స్పష్టత వచ్చాక తమ వైఖరి కూడా ప్రకటిస్తామని ఘాటుగా స్పందించింది. 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)