చరిత్ర సృష్టించిన వెస్టిండీస్‌- పాక్‌ టెస్టు మ్యాచ్‌

Published on Thu, 07/30/2026 - 14:00

వెస్టిండీస్‌- పాకిస్తాన్‌ మధ్య జరిగిన తొలి టెస్టు కరేబియన్‌ గడ్డపై సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఈ మ్యాచ్‌ సందర్భంగానే వెస్టిండీస్‌లో తొలిసారి ఒక టెస్టు మ్యాచ్‌లో పేసర్లు అత్యధికంగా నలభై వికెట్లు కూల్చారు. కాగా ఒకప్పుడు పేస్‌ బౌలర్లకు స్వర్గధామంగా నిలిచిన కరీబియన్‌ పిచ్‌లపై చాలా రోజుల తర్వాత విండీస్‌- పాక్‌ మధ్య ట్రినిడాడ్‌ వేదికగా తొలి టెస్టు సందర్భంగా మళ్లీ ఆ దృశ్యం కనిపించింది.

90 పరుగుల తేడాతో
ఆద్యంతం ఫాస్ట్‌ బౌలర్లు ఆధిపత్యం చలాయించిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 90 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ జట్టును మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య విండీస్‌ 1–0తో ముందంజ వేసింది. కాగా వెస్టిండీస్‌ విధించిన 211 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 40.2 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది.

కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (107 బంతుల్లో 58 నాటౌట్‌; 9 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఇతర బ్యాటర్లందరూ విఫలం కాగా... ఆఖరి వికెట్‌గా క్రీజులోకి అడుగుపెట్టిన మొహమ్మద్‌ అబ్బాస్‌ (23; 4 ఫోర్లు) జట్టులో రెండో అత్యధిక స్కోరు చేశాడు. 

బాబర్‌–అబ్బాస్‌ 49 పరుగులు జోడించడం విశేషం. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. అజాన్‌ అవైస్‌ (3), ఇమాముల్‌ హక్‌ (3), సల్మాన్‌ ఆఘా (0), మహమ్మద్‌ రిజ్వాన్‌ (11), ఆమేర్‌ జమాల్‌ (0), అలీ ఉస్మాన్‌ (2), షాన్‌ మసూద్‌ (3) పెవిలియన్‌కు క్యూ కట్టారు.

బాబర్‌ రాణించినా...
ఇక తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో గాయపడ్డ షాన్‌ మసూద్‌ జట్టుకు అత్యవసర దశలో ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచ్చినా... ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ సిరీస్‌ ద్వారానే తిరిగి పాకిస్తాన్‌ టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న బాబర్‌ ఆజమ్‌ ఒకవైపు క్రీజులో పాతుకుపోయినా... మరోవైపు అతడికి అండగా నిలిచే వారు లేకపోయారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో 244/4తో పటిష్ట స్థితిలో కనిపించిన పాకిస్తాన్‌ ఆ తర్వాత 38 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోగా... రెండో ఇన్నింగ్స్‌లో 71 పరుగులకే తొలి 9 ఇకెట్లు కోల్పోవడం గమనార్హం. వెస్టిండీస్‌ బౌలర్లలో జైడెన్‌ సీల్స్‌ 5 వికెట్లు పడగొట్టగా... రోచ్, గ్రీవ్స్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి నేలకూలిన 40 వికెట్లు పేసర్ల ఖాతాలోకే వెళ్లడం విశేషం.

గ్రీవ్స్‌ దెబ్బ
అంతకుముందు వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా... పాకిస్తాన్‌ 282 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులు చేసిన ఆతిథ్య విండీస్‌... పాక్‌ జట్టు ముందు ఊరించే లక్ష్యాన్ని ఉంచింది. 

అయితే బ్యాటర్ల వైఫల్యంతో పాక్‌ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమై పరాజయం మూటగట్టుకుంది.  విండీస్‌ పేసర్‌ జస్టిన్‌ గ్రీవ్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.  

మొత్తంగా ఆరోసారి.. కరేబియన్‌ గడ్డపై ఇదే తొలిసారి
టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక మ్యాచ్‌లో మొత్తం 40 వికెట్లను పేస్‌ బౌలర్లే తీయడం ఇది ఆరోసారి. గత నెలలో లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో ఈ అద్భుతం నమోదైంది. అంతకుముందు ఇంగ్లండ్‌–వెస్టిండీస్‌ (1984) టెస్టులో, పాకిస్తాన్‌–జింబాబ్వే (1993) టెస్టులో, ఇంగ్లండ్‌–దక్షిణాఫ్రికా (1998) టెస్టులో, భారత్‌–దక్షిణాఫ్రికా (2018) టెస్టులో 40 వికెట్లు పేస్‌ బౌలర్ల ఖాతాలోకి వెళ్లాయి.

అయితే, కరేబియన్‌ గడ్డపై 96 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో ఇలా పేసర్లే ఓ టెస్టు మ్యాచ్‌లో 40 వికెట్లు కూల్చడం ఇదే తొలిసారి.  అంతేకాదు.. వెస్టిండీస్‌- పాక్‌ మధ్య జరిగిన తొలి టెస్టు విండీస్‌లో జరిగిన 273వ మ్యాచ్‌ కాగా.. టరూబా వేదికగా నిర్వహించిన తొలి టెస్టు మ్యాచ్‌ ఇదే. ఇదిలా ఉంటే.. ఒక టెస్టు మ్యాచ్‌లో మొత్తం 40 వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోకి ఇప్పటి వరకు వెళ్లలేదు.  

వెస్టిండీస్‌ గడ్డ మీద టెస్టు మ్యాచ్‌లో పేసర్లు అత్యధిక వికెట్లు తీసిన సందర్భాలు
వెస్టిండీస్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌- 2026లో బ్రియన్‌ లారా స్టేడియంలో 40 వికెట్లు
వెస్టిండీస్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా- 2025లో సబీనా పార్కులో 38 వికెట్లు
వెస్టిండీస్‌ వర్సెస్‌ భారత్‌- 1997లో కింగ్‌స్టన్‌ ఓవల్‌లో 38 వికెట్లు
వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌- 1990లో కింగ్‌స్టన్‌ ఓవల్‌లో 37 వికెట్లు  
వెస్టిండీస్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌- 2021లో సబీనా పార్కులో 37 వికెట్లు.

చదవండి: గిల్‌ సంచలన నిర్ణయం!

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)