WI Vs IRE: వెస్టిండీస్‌పై ఐర్లాండ్‌ సంచలన విజయం.. ఏకంగా..

Published on Fri, 01/14/2022 - 12:43

Ireland Beat West Indies : ఐర్లాండ్‌ సంచలన విజయం సాధించింది. వెస్టిండీస్‌ను ఐదు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి సిరీస్‌ గెలుపు ఆశలను సజీవంగా ఉంచుకుంది. కాగా మూడు వన్డేలు ఆడే నిమిత్తం ఐర్లాండ్‌.. వెస్టిండీస్‌ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి వన్డేలో ఆతిథ్య విండీస్‌ 24 పరుగుల తేడాతో గెలుపొందగా.. పర్యాటక జట్టులో కోవిడ్‌ కేసుల కారణంగా రెండో వన్డే వాయిదా పడింది. 

ఈ నేపథ్యంలో జనవరి 11న జరగాల్సిన మ్యాచ్‌ను 13వ తేదీన నిర్వహించారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో పొలార్డ్‌ బృందం 229 పరుగులకు ఆలౌట్‌ కాగా... వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయీస్‌ నిబంధన ప్రకారం మ్యాచ్‌ను 36 ఓవర్లకు కుదించారు. ఇందులో భాగంగా 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌... 32.3 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విండీస్‌పై విజయం సాధించింది. 

ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆండీ మెక్‌బ్రైన్‌(4 వికెట్లు... 45 బంతుల్లో 35 పరుగులు) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. హ్యారీ హెక్టార్‌ 54 పరుగుల(నాటౌట్‌)తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఐర్లాండ్‌ కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ వన్డే కెరీర్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఐరిష్‌ క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఈ విజయం గురించి స్పందించిన పాల్‌.. విండీస్‌పై గెలుపు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. 

స్కోర్లు:
వెస్టిండీస్‌- 229 (48)
ఐర్లాండ్‌- 168/5 (32.3)  

చదవండి: Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్‌.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్‌

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

భద్రాచలం : కన్నుల పండువగా శ్రీ సీతారాముల తెప్పోత్సవం (ఫొటోలు)

+5

ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)