Breaking News

ఇంగ్లండ్‌ బౌలర్‌కు జరిమానా

Published on Tue, 11/12/2024 - 20:41

ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ రీస్‌ టాప్లేకు జరిమానా పడింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 సందర్భంగా టాప్లే అసహనంతో కుర్చీని విరుగగొట్టాడు. దీంతో ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఉల్లంఘణ కింద టాప్లే మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించారు. అలాగే టాప్లే ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా పొందాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 సందర్భంగా టాప్లే గాయపడ్డాడు (మోకాలి గాయం). ఆ మ్యాచ్‌లో 2.4 ఓవర్లు వేసిన టాప్లే, ఆతర్వాత గాయం కారణంగా తన కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు. గాయం అనంతరం టాప్లే అర్దంతరంగా మైదానాన్ని వీడాడు. మైదానాన్ని వీడే క్రమంలో టాప్లే అసహసనంతో హ్యాండ్‌రెయిల్‌పై కుర్చీతో బలంగా కొట్టాడు. 

ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన ఐసీసీ.. కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ లెవెల్‌-1 ఉల్లంఘన కింద జరిమానా విధించింది. గాయం కారణంగా టాప్లే రెండో టీ20లో కూడా ఆడలేదు. అతను మూడో టీ20 ఆడటం కూడా అనుమానమే అని తెలుస్తుంది.

టాప్లే గాయపడిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఫిల్‌ సాల్ట్‌ మెరుపు సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్‌ 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

అనంతరం జరిగిన రెండో టీ20లో కూడా ఇంగ్లండే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ మెరుపుల కారణంగా ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. బట్లర్‌ వీర ఉతుకుడు ఉతకడంతో ఇంగ్లండ్‌ మరో 31 బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నవంబర్‌ 14న సెయింట్‌ లూసియా వేదికగా జరుగనుంది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)