డేంజర్‌ జోన్‌లో విండీస్‌.. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుందా?

Published on Sun, 06/25/2023 - 10:04

రెండుసార్లు ప్రపంచకప్‌ విజేత.. అరవీర భయంకరమైన బౌలర్లు.. అదే స్థాయిలో ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడిన బ్యాటర్లు.. నాలుగు దశాబ్దాల పాటు క్రికెట్‌ను శాసించిన వైనం. ఇప్పుడు అదంతా గతం. తాజాగా వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడం కోసం వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ పోరులో ఆడాల్సిన దుస్థితి వెస్టిండీస్‌కు ఎదురైంది.

అయితే శనివారం జింబాబ్వేతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదే ఓటమి ఆ జట్టును డేంజర్‌ జోన్‌లో పడేసింది. క్వాలిఫయర్‌ టోర్నీలో భాగంగా లీగ్‌ దశలో సాధించిన విజయాల ఆధారంగా వచ్చే పాయింట్లు సూపర్‌ సిక్స్‌లో లెక్కిస్తారు. సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ చేయబడతాయి. ఈ దశ మ్యాచ్‌లు అయిపోయే సరికి టాప్‌ 2లో ఉన్న జట్లు భారత్‌ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్-2023కు అర్హత సాధిస్తాయి.

ఇక మ్యాచ్‌లో విండీస్‌ ఓడినప్పటికి సూపర్‌ సిక్స్‌ దశకు  చేరుకున్నా రెండు పాయింట్లు మాత్రం కోల్పోయింది. ఇది సూపర్‌సిక్స్‌ దశలో ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. లీగ్‌లో వెస్టిండీస్‌ తన చివరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడుతుంది. ఒకవేళ మ్యాచ్‌లో గెలిస్తే గ్రూప్‌-ఏ నుంచి టాప్‌-2గా అడుగుపెడుతుంది. ఇక జింబాబ్వే తన ఆఖరి పోరులో అమెరికాను ఎదుర్కొంటుంది.

ఏదైనా సంచలనం నమోదైతే తప్ప జింబాబ్వే గ్రూప్‌ టాపర్‌గా సూపర్‌ సిక్స్‌ దశకు చేరుకుంటుంది. ఎందుకంటే జింబాబ్వే గ్రూప్‌ టాపర్‌గా ఉంటుంది కాబట్టి విండీస్‌ సూపర్‌ సిక్స్‌ దశలో అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్‌ ఓడినా ఆ జట్టు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో విఫలమవుతుంది.

చదవండి: 'అమ్మా నన్ను మన్నించు'.. హాకీ దిగ్గజం ధనరాజ్‌ పిళ్లై

గొడవపడ్డ భారత్‌, నేపాల్‌ ఆటగాళ్లు.. తప్పు మనోడిదేనా!

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)