IND vs SL: శ్రీలంకతో తొలి వ‌న్డే.. నల్ల బ్యాండ్​ల​తో భారత జట్టు! ఎందుకంటే?

Published on Fri, 08/02/2024 - 15:17

కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు నలుపు రంగు బ్యాండ్​లు ధరించి మైదానంలోకి దిగారు. భారత మాజీ క్రికెటర్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ బుధవారం(జూలై 31) తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే ఆయనకు నివాళిగా భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్​లు ధరించారు. క్యాన్సర్‌తో పోరాడుతూ  గైక్వాడ్ కన్నుమూశారు. గైక్వాడ్ భారత్ తరఫున మొత్తం 55 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో బరోడా తరఫున 250కి పైగా మ్యాచ్‌లు ఆడారు. ఆయన మృతి పట్ల బీసీసీఐతో పాటు పలువురు ఆటగాళ్లు ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు. 

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ఈ మ్యాచ్‌తో శ్రీలంక త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ తిరిగి భార‌త జ‌ట్టుతో  చేరారు.
తుది జట్లు..
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌

శ్రీలంక: చరిత్‌ అసలంక (కెప్టెన్‌), పథుమ్‌ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్‌ మెండిస్‌ (వికెట్‌కీపర్‌), సధీర సమరవిక్రమ, దునిత్‌ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్‌ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్‌ సిరాజ్‌

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)