ఇదేమి బ్యాటింగ్‌ రా బాబు.. అందుకే 'చోకర్స్‌' ట్యాగ్‌ లైన్‌

Published on Thu, 11/16/2023 - 15:52

వరల్డ్‌ క్రికెట్‌లో 'చోకర్స్' అంటే మనకు టక్కున దక్షిణాఫ్రికానే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్‌‌లలో చేతులెత్తేసే నైజం సౌతాఫ్రికాది. అందుకే ప్రోటీస్‌ జట్టును చోకర్స్‌ అని పిలుస్తుంటారు. వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అవుతుందన్న మాటను మరోసారి దక్షిణాఫ్రికా నిజం చేసంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు.

ఆసీస్‌ బౌలర్ల ధాటికి సఫారీలు విలవిల్లాడుతున్నారు. కేవలం 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి పవర్‌లో ప్లేలో అయితే సౌతాఫ్రికా కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. లీగ్‌ మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు మెరుపులు మెరిపించిన దక్షిణాఫ్రికా.. సెమీస్‌లో మాత్రం కంగారుల ముందు తలవంచింది.

ఆసీస్‌ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బకొట్టారు. 14 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది.  ఈ ఏడాది వరల్డ్‌కప్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో దుమ్మురేపిన సౌతాఫ్రికా.. కీలకమైన సెమీస్‌లో మాత్రం చేతులెత్తేసింది.
చదవండి: MS Dhoni: ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామానికి వెళ్లిన ధోని.. ఆమె పాదాలకు నమస్కరించి..

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)