పీసీబీ కీలక నిర్ణయం.. మరోసారి..

Published on Wed, 12/31/2025 - 10:44

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశిస్తున్న పాకిస్తాన్‌ జట్టు... కాంట్రాక్టు ముగియడానికి మూడు నెలల ముందే అజహర్‌ మహమూద్‌ను టెస్టు హెడ్‌ కోచ్‌ నుంచి తప్పించనున్నట్లు సమాచారం. 

గత రెండేళ్లుగా జాతీయ జట్టుకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్న అజహర్‌ స్థానంలో కొత్త కోచ్‌ను నియమించేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) ప్రయత్నాలు ప్రారంభించింది.

మరోసారి ‘హెడ్‌కోచ్‌’పై వేటు
డబ్ల్యూటీసీ 2025–27లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్‌ ఒక దాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడి 50 పాయింట్ల శాతంతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. గతేడాది టెస్టు ఫార్మాట్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అజహర్‌ (Azhar Mahmood) కాంట్రాక్టు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది. అయితే అంతకుముందే అతడిని తొలగించేందుకు సిద్ధమైంది.

ప్రధాన కోచ్‌తో పాటు
‘మార్చితో అజహర్‌ మహమూద్‌ కాంట్రాక్ట్‌ ముగియనుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌ జట్టు టెస్టు సిరీస్‌లు ఆడనుంది. అయితే మ్యాచ్‌ల ఆరంభానికి ముందే కొత్త కోచ్‌ను నియమించేందుకు బోర్డు ప్రయత్నాలు చేస్తోంది’ అని ఓ అధికారి తెలిపారు. ప్రధాన కోచ్‌తో పాటు మొత్తం శిక్షణ బృందం కోసం పీసీబీ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది పాకిస్తాన్‌ జట్టు... బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.

జట్టు ఎంపిక విషయంలో  పొరపొచ్చాలు రావడంతో ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ జాసెన్‌ గిలెస్పీ గతేడాది టెస్టు హెడ్‌ కోచ్‌ బాధ్యతల నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో మొదట ఆఖిబ్‌ జావేద్, ఆ తర్వాత అజహర్‌ మహమూద్‌ ఆ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు.. మహిళల జట్టు కోసం కూడా కొత్త కోచింగ్‌ సిబ్బంది కోసం పాకిస్తాన్‌ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించింది.

చదవండి: బీసీసీఐ యూటర్న్‌!.. షమీకి గోల్డెన్‌ ఛాన్స్‌!

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)