Breaking News

13 ఏళ్ల కుర్రాడికి జాక్ పాట్‌.. ఏకంగా రూ.1.10 కోట్లు! ఎవ‌రీ సూర్య‌వంశీ?

Published on Mon, 11/25/2024 - 22:29

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్య‌వంశీకి జాక్‌పాట్ తగిలింది. ఈ 13 ఏళ్ల యువ క్రికెటర్‌ను రూ.1.10 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కైవసం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 

అత‌డి ప్రస్తుత వ‌య‌స్సు 13 ఏళ్ల 243 రోజులు మాత్ర‌మే. రూ.30ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌తో వేలంలోకి వ‌చ్చిన సూర్య వంశీ కోసం తొలుత రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌,  ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు పోటీప‌డ్డాయి. ఆఖ‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ రేసు నుంచి వైదొల‌గ‌డంతో ఈ యువ క్రికెట‌ర్‌ను రాజ‌స్తాన్ త‌మ సొంతం చేసుకుంది.

ఎవరీ వైభవ్ సూర్య‌వంశీ?
13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 2011లో బిహార్‌లోని తాజ్‌పుర్ గ్రామంలో జ‌న్మించాడు. అత‌డికి చిన్న‌త‌నం నుంచే క్రికెట్ అంటే మ‌క్కువ ఎక్కువ‌. ఆ దిశ‌గానే వైభ‌వ్ అడుగులు వేశాడు. అత‌డు అద్బుత‌మైన క్రికెట‌ర్‌గా ఎద‌గ‌డంలో అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీది కీల‌క పాత్ర‌. 

8 ఏళ్లకే వైభ‌వ్‌ను క్రికెట్ అకాడమీలో చేర్పించి రెండేళ్లపాటు శిక్షణ సంజీవ్ ఇప్పించాడు. ఈ క్ర‌మంలోనే కేవ‌లం 12 సంవత్సరాల 284 రోజుల వయస్సులో ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టి వైభవ్‌ చ‌రిత్ర సృష్టించాడు.

2023-24 రంజీ ట్రోఫీ సీజన్‌లో బిహార్‌ తరపున ఫస్ట్‌క్లాస్‌ డెబ్యూ చేశాడు. తద్వారా రంజీ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్‌ నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు 4 మ్యాచ్‌లు రంజీ మ్యాచ్‌లు ఆడిన సూర్య‌వంశీ..87 ప‌రుగులు చేశాడు. 

ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో ఆస్ట్రేలియా అండ‌ర్‌-19తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్‌లో వైభవ్ కేవ‌లం 58 బంతుల్లో సెంచరీ చేసి స‌త్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడిని రాజస్తాన్‌ రాయల్స్‌ పోటీపడి మరి సొంతం చేసుకుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)